-------------------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------------
MERCY ON SLUMS
గల్ఫ్ బాధితులకు అండగా..
గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు అనేకమంది ఏజెంట్ల మోసాలకు గురి అయి తీవ్ర కష్టాలకు లోనవుతున్నారు.వారిని ఆదుకోవడం కోసం కొందరు తెలుగువారు మెర్సీ ఆన్ స్లమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దానిని ఈ వెబ్ సైట్ లో యధాతధంగా ప్రచురిస్తున్నాము. (-గౌరవ చీఫ్ ఎడిటర్ NTV)
మిత్రులారా!
బ్రతుకుదెరువు కొరకు విదేశాలకు అప్పులు చేసి వెళ్ళుతున్న వారు ఎన్నో కష్టాలు పడి వెళ్తుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోని పరిస్తితులవలన ఆకస్మికముగా మరణించిన వారికి సహాయముగా ఉండాలని మరియు మా యొక్క ఆవేధనలతో ఏర్పరచిన MERCY ON SLUMS ఎంతో మంది గల్ఫ్ బాధితులకు ఆధారముగా నిలబడాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము.
గల్ఫ్ వెళ్లేవారికి వెళ్ళే స్తోమత లేకపోయినా కూడా వారు అప్పోసప్పో చేసి, ఏజెంట్లకు లక్షల రూపాయలు కట్టి, నెలల తరబడి వారి చుట్టూ తిరిగి, సొమ్మసిల్లిపోయి ఎదురు చూస్తుంటారు కాని ఏజెంట్లు మాత్రం వారికి నేలకోద్ది మోసగింపు మాటలు చెప్పి నమ్మిస్తారు. ఇలా సమయం గడిచే కొద్ది తీసుకున్న అప్పు సమయం దగ్గర పడుతుంది, ఇటు అప్పు కట్టలేక అటు విదేశాలకు వెళ్ళలేక చాల బాధలు పడుతుంటారు. అయితే కొందరు విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగాలు ఉన్నాకూడా తగిన సంపాదన లేక ఒత్తిడిలకు లోనవుతుంటారు, మరికొందరు సంపాదన ఆశించిన విధముగా ఉన్న కూడా వారి పైఅధికారుల చిన్న చూపుతో వారియొక్క బ్రతుకును గడపడం వారికి పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి బాధలను వారి మనసులో ఆలోచించుకుంటూ వారు ఉద్యోగాలకు వెళ్తున్న సమయంలో ఏ దారి ఎలాగా ధాటుతున్నారో కూడా తెలియకుండా ఆక్సిడెంట్ లకు గురి అవుతున్నారు.
ఇలాంటి ఏజెంట్ల మోసానికి గురవుతున్న వారికి అండదండలుగా ఉండాలన్న సదుద్దేశ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాము. మీ అందరి సహకారంతో ఈ MERCY ON SLUMS ఎంతో మందికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాము. Joel Chandra Mulugu, Bandaru Rajendra Prasad, Ramakrishna Chintha, Kurukelly Atmacharan, Narendher Gorre.
-------------------------------------------------------------------------------------------------------------
Gulf Indians
Fraud Agents:
There are many people who want to go to gulf for livelihood fall prey to the cheating agents who promise them good jobs in the Gulf. The aspiring candidates after being assured of the job by the agents coming from economically weaker section, take huge loans on interest and some times even mortgage their only property dreaming that they will be able to repay by working in the Gulf.
Once the money is paid to the agent, they keep making promises only to be postponed for further dates and this goes on from days to months to years. Those who mortgage their property or take loan are neither able to pay any interest nor can work as they expect to leave for the Gulf. As they have no work, the situation makes them lazy, and due to financial problems they turn to robbery to meet their needs.
There are some agents who claim that they can provide very good jobs in countries like Bahrain, Saudi Arabia, Oman, Dubai - UAE, Kuwait, Malaysia, Iraq and Afghanistan and take from them lakhs of rupees by charging extra to forge experience certificates for them. The agents promise them to send within 2 days and provide accommodation in small hotels in cities like Hyderabad, Delhi, Chennai Nagpur etc and make them stay for atleast 2-3 weeks. They finally give them the air ticket and visa. After this entire ordeal the candidates feel happy and dream that they will make it up after working in the Gulf. Their dreams are waiting to be shattered once they reach the airport, only to be told that the visa and ticket is fake / not valid and are thrown out of the airport.
There is a case where in few people who were promised to be sent to the Gulf for almost 6 months, gathered outside the house of the agent and warned to commit suicide by consuming insecticide.
In another case a sub agent who took Rs. 3.5 lacs and promised to send them to gulf but failed to do so. Upon the pressure from the candidates he had to pay back by selling his own property. He did not get any money from the main agent who actually took the money. Fed up with the financial problems, the subagent along with his family committed suicide at the agent’s residence.
It is very sad that many aspiring candidates having many dreams about going and working in gulf. They are falling prey to fraud agents making the lives of the candidates miserable.
Many of whom who are not able to repay the loan, cannot take the insult and commit suicide…..
Problems faced after reaching gulf…..
Very few who manage to reach Gulf, have other problems waiting for them….Once they reach gulf they realize that the company for which they got visa does not exist at all and have no place to stay, so they keep searching for some accommodation and if at all they find it is like a china room type where 10-15 people stay together like cattles overloaded in a shed. To meet the needs they are found lingering on the street and collecting tins and some times are caught by the police. Who abuse them and finally send them back to India. Those who are not caught keep lingering on the streets without any jobs. They feel like calling their kin back home, but for the fear of the money lenders they don’t call. Some go into depression due to this situation and take the extreme step of committing suicide.
In some cases those who do have job, get meager salary who cannot afford proper meals. They just cook once and adjust it for 2 - 3 days. Many such people who are engrossed in their minds regarding their situation are found to meet with accidents on roads.
Back at home, the family members happily wait for their return but unfortunately receive their dead bodies. The ageing parents having hopes that once their son grows will be working and earning and will support financially, the newly married wife who eagerly counts on number of days that her husband will return from gulf and small children who also eagerly await their father will come from gulf and bring many things apart from the toys… only to receive the dead bodies of their loved ones.
Due to this situation, many aged parents, grandparents approach the government for help, assistance, but nothing comes from them infact they have to go through mental and physical strain to follow up with the government offices….
In such circumstances comes “MERCY ON SLUMS” as a ray of hope for Children, all those exploited gulf candidates, and underprivileged and poor slum dwellers. Hoping that with your great support “MERCY ON SLUMS” will meet all the needs of people in distress.
E-mail: mercyonslums@gmail.com
Heart fully MERCY ON SLUMS..!!
-------------------------------------------------------------------------------------------------------------
గల్ఫ్ మిగిల్చిన విషాదం
గంభీరావుపేట, న్యూస్ లైన్ : ఉపాధి కోసం ఉరు విడిచి గల్ఫ్ బాట పట్టిన ఇద్దరు అనారోగ్యంతో మృతి చెందారు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దండవేని రాములు పదిహేను రోజుల క్రితం అనారోగ్యంతో మస్కట్లో మృతిచెందగా మంగళవారం మృతదేహం స్వగ్రామం చేరింది. సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన షేక్ నిజామోద్దిన్ మస్కట్ లో క్యాన్సర్ వ్యాధిన పడి మూడు నెలల క్రితం ఇంటికి తిరిగొచ్చాడు. వ్యాధి తీవ్రత ఎక్కువై మంగళవారం తుదిశ్వాస విడిచారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన రాములు మూడు సంవత్సరాల క్రితం విజిట్ వీసాపై దుబాయి వెళ్ళాడు. అక్కడి ప్రభుత్వం విధించిన ఆంక్షలతో అక్కడి నుంచి మస్కట్ వెళ్ళాడు. అక్కడ పనులు దొరక వస్తులతో కాలం వెళ్లదీశాడు. కాలక్రమంలో అనారోగ్యానికి గురై పదిహేను రోజుల క్రితం మృతి చెందాడు. అతడి మృతదేహం రప్పించడం కోసం స్థానికులు ఎంతగానో ప్రయత్నించారు. మంగళవారం రాములు మృతదేహం స్వగ్రామానికి చేరింది. నిరుపేద కుటుంబానికి చెందిన రాములు అంత్యక్రియలు కోసం స్థానికులు విరాళాలు పోగు చేశారు. మ్రుతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కాగ, మండలంలోని సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన షేక్ నిజామోద్దిన్ మూడేళ్ళ క్రితం మస్కట్ వెళ్ళాడు. అక్కడ క్యాన్సర్ వ్యాధి రావడంతో మూడు నెలల క్రితం ఇంటికి తిరిగొచ్చాడు. నిరుపేద కుటుంబీకుడు కావడంతో ఖరీదైన వైద్యం చేయించుకోలేకపోయాడు. వ్యాధి తీవ్రత ఎక్కువై మంగళవారం మృతి చెందాడు. మ్రుతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు.
________________________________________________________________
దుబాయిలో ఆత్మకూర్ వాసి మృతి
మేట్ పల్లి గ్రామీణం,న్యూస్ టుడే: ఉపాధి కోసం ఉన్న ఉరిని, కన్న వారిని కాదని ఎడారి దేశానికి వెళ్ళిన ఆత్మకూర్ వాసి మృత్యువాత పడటం గ్రామంలో విషాదాన్ని నింపింది. మేట్ పల్లి మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన చిలువేరి మల్లేశ్ (31) బతుకుదెరువు కోసం గత 7నెలల క్రితం అప్పుచేసి కుటుంబ పోషణ కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడి అలునామ భవన నిర్మాణ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. నెల పూర్తి కాగానే ఇంటికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకునేవాడు. హటాత్తుగా మంగళవారం మల్లేశ్ మృతిచెందినట్లు వార్త రావడం ఆ కుటుంబానికి తీరని లోటుగా మిగిలింది. దుబాయిలోని రోడ్డు పక్కన మల్లేశ్ మృతదేహాన్ని చూసినవారు. అదే కంపెనీలో ఉన్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన వారు. విషయం కుటుంబసభ్యులకు చేరవేశారు. మల్లేశ్ ఎలా మరణించాడో తెలియదని దానికోసం తెలుసుకుంటామని మృతుని బంధువులకు ప్రవాస భారతీయులు తెలిపారు. తండ్రి వస్తాడని ఇద్దరు పిల్లలు ఎదుచుస్తున్నారని, ఆ సమయంలో మల్లేశ్ మృతి వార్త రావడం కలిచి వేసిందని బంధువులు తెలిపారు. మృతునికి భార్య భారత , కూతురు మనీషా, కొడుకు మనోజ్ లు ఉన్నారు.
________________________________________________________________
స్వగ్రామానికి చేరిన మృతదేహం
ఉప్పరమల్యాల (గంగాధర), న్యూస్ టుడే : ఉపాధి కోసం అప్పులు చేసి గల్ఫ్ కి వెళ్ళిన ఓ అభాగ్యుడు ప్రాణాలు కోల్పోయి శవపేటికలో ఇంటికి చేరాడు. కన్నవారిని .. ఉన్న ఉరిని విడిచివెళ్లి ఎనిమిదేల్లయినా చేసిన అప్పులు తీరక గుండెపోటుతో పరాయి దేశంలో తనువూ చాలించిన సంఘటన గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే... సుందరగిరి లింగయ్య, నర్సమ్మల కొడుకు మహిపాల్ (28) ఎనిమిదేళ్ళ క్రితం రూ. 1.50 లక్షల అప్పు చేసి మస్కట్ దేశానికి వెళ్ళాడు. అయితే అక్కడ కంపెనీలో పనులు దొరకక ఉపాధి భారమైంది. చేసిన అప్పులు తీర్చడానికి కంపెనీ నుంచి బయటకు వచ్చిన మహిపాల్ ఎన్నో కస్టాలు పడి జీవితంలో స్థిరపడే సమయంలోనే గత నెల 28న గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మహిపాల్ మృతదేహానికి మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు. మండల పరిషత్తు ఉపాధ్యాయులు జరిపారు. మండల పరిషత్తు ఉపాధ్యాయుడు కర్ర బాపురెడ్డి, సర్పంచి దూస లక్ష్మి నారాయణ గ్రామస్థులు బాధిత ప్రభుత్వాన్ని కోరారు.
________________________________________________________________
స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం
సిరిపూర్ (మల్లాపూర్), న్యూస్ టుడే: దుబాయ్ భవన ప్రమాదంలో మృతి చెందిన కట్కం గంగారం (48) మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరింది. మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చేరింది. మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన కట్కం గంగారాం నాలుగేళ్ళ క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడి జనరల్ అల్ సఫర్ కంపెనీలో వాచ్ మెన్గా చేరాడు. జనవరి-29న రాత్రి డ్యూటీలో అపార్ట్మెంట్ లో అద్దాలకు ఉన్న తాడును తీస్తుండగా ప్రమాదవశాత్తు అద్దాలు మీదపడటంతో గంగారం అక్కడిక్కడే మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో శవపేటిక స్వగ్రామం చేరుకొంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి భార్య చిన్నలక్ష్మితో పాటు కూతురు రాణి, కొడుకు చంద్రశేఖర్ లు ఉన్నారు.
________________________________________________________________
రియాద్ లో నగర వాసి దుర్మరణం
హైదరాబాద్, న్యూస్ టుడే; రియాద్ లో జరిగిన రహదారి ప్రమాదంలో నగరానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. చంపాపేట యాదగిరినగర్ కు చెందిన మహమ్మద్ నయీముద్దీన్ (34) 2004 లో ఓ ప్రైవేటు సంస్థల్లో పని చేసేందుకు రియాద్ లోని ఆల్ కర్జ్జే వెళ్లారు.శనివారం మధ్యాహ్నం ఇంటికి వెళ్తుండగా తప్పుడు మార్గం లో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు అతని కారును డీకొట్టడంతో నయీముద్దీన్ అక్కడిక్కడే మృతి చెందాడు. అతనితో ప్రయాణిస్తున్న స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
________________________________________________________________
గల్ఫ్ లో మల్కాపూర్ వాసి మృతి
24 రోజుల తర్వాత స్వగ్రామానికి చేరిన మృతదేహం
కరీంనగర్ గ్రామీణం, న్యూస్ టుడే; జీవనోపాధికోసం ఎడారి దేశానికి వలస వెళ్లి, అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన దేవునూరి నారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇతని మృతితో ఆ కుటుంబం దిక్కు లేనిదిగా మారింది. గ్రామస్థులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... దేవునూరి నారాయణ (36) వృత్తిరిత్యా మేస్త్రి పని చేస్తుంటాడు. వ్యవసాయ భూమి అంత లేకపోవడంతో, మేస్త్రీ పనిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. ఈ క్రమంలో అప్పులు చేసి ఏడాదిన్నర క్రితం మస్కట్ కు వెళ్ళాడు. గత నెల 26న పని చేసి సాయంత్రం తిరిగి క్యాంపునకు వాహనంలో వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో వాహనంలో డ్రైవర్ తో సహా మొత్తం ముగ్గురు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్, నారాయణ అక్కడిక్కడే మృతి చెందారు. జిల్లాకు చెందిన మరో వ్యక్తికి కాళ్ళు, చేతులు విరిగి తీవ్ర గాయాలతో మస్కట్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గత నెల 26న చనిపోయిన నారాయణ మృతదేహాన్ని మస్కట్ నుంచి అన్ని లాంచనాలు పూర్తి చేసి 24 రోజుల తర్వాత మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి స్వగ్రామమైన మల్కాపూర్ కు తీసుకువచ్చారు. అతని భార్య ప్రమీలా, ఇద్దరు కూతుళ్ళు అనూష (15), శిరీష (10) లు ఉన్నారు. గ్రామ సర్పంచి బొమ్మ ఈశ్వర్ గౌడ్, ఎంపిటిసి సభ్యురాలు రజితలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి తగు సహాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కడసారి చూపునకు గ్రామస్థులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు.
________________________________________________________________
ధర్మారం, న్యూస్ లైన్; ధర్మారం మండల కేంద్రానికి చెందిన బతికిని గట్టుమల్లు (22) అనే యువకుడు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.బంధువుల కథనం ప్రకారం ... గట్టుమల్లు జీవనోపాధికోసం 11 నెలల క్రితం సుమారు లక్ష రూపాయలు అప్పుచేసి సౌదీకి వెళ్ళాడు. ఈ నెల 21న విధులు ముగించుకొని తన గదికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అక్కడే ఉంటున్న మృతుని మేనమామ ఒర్సు రవి బుధవారం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మరణవార్త విన్న వెంటనే తల్లిదండ్రులు బాలమ్మ, రాజయ్యలతో పాటు సోదరిమణులు, బంధువులు కుప్పకూలిపోయారు.
________________________________________________________________
దుబాయి లో వేంపేట వాసి మృతి
వేంపేట (మేట్ పల్లి గ్రామీణం), న్యూస్ టుడే ; మెట్ పల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన వన్నెల రమేష్ (20) దుబాయిలో మృతి చెందాడు. ఉపాధి కోసం మూడు సంవత్సరాల క్రితం అబుదాబిలోని భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. శుక్రవారం తన గదిలోని బాత్ రూంలో ఉరి వేసుకొని ఉండడంతో మ్రుతున్ని చుసిన స్నేహితులు కుటుంబీకులకు విషాయాన్ని తెలపడంతో రోదనలు మిన్నతాయి. అప్పులు చేసి రమేష్ ను దుబాయికి పంపించమని చేసిన అప్పులు అలాగే ఉన్నాయని ప్రభుత్వ ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
________________________________________________________________
గుండెపోటుతో గల్ఫ్ బాధితుడి మృతి
సిరిసిల్లపట్టణం, న్యూస్ టుడే: సిరిసిల్ల పట్టణం బి.వై.నగర్ కు చెందిన స్తంభంపల్లి రామస్వామి (53) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆరు నెలల క్రితం వడ్రంగి కుల వృత్తి చేసే రామస్వామి ఇక్కడ ఉపాధి కరువై అప్పు చేసి దుబాయ్ వెళ్ళాడు. ఆర్ధిక మాంద్యంతో రామస్వామిని దుబాయ్ కంపెనీ వీసా ఉన్నప్పటికీ స్వగ్రామానికి పంపించింది. చేసిన అప్పు రూ. 2 లక్షలు తీరక ముందే రామస్వామి సిరిసిల్లకు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రెండేళ్ళ క్రితం ఒకసారి దుబాయ్ వెళ్ళివచ్చిన రామస్వామి అప్పుడు కూడా మోసానికి గురయ్యాడు. అప్పులు ఇలా తీర్చలో మదనపడుతున్న క్రమంలోనే రామస్వామికి సరైన ఉపాధి ఇక్కడ లభించలేదు. మానసిక వేదనతో ఉన్న రామస్వామి చివరకు గుండెపోటు గురై అసువులు బాశాడు. భార్య లక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు.
________________________________________________________________
గల్ఫ్ బాటలో ఆగిన గుండె
23 రోజులకు స్వగ్రామం చేరిన మృతదేహం
భీమదేవరపల్లి, న్యూస్ టుడే; ఉన్న ఉరిలో ఉపాధి కరవడంతో గల్ఫ్ బాట పట్టిన ఓ వలస జీవి ఉపిరి ఆగిపోయింది. గుండెపోటుతో మృతి చెందిన ఆ అభాగ్యుని మృతదేహం అనంతరం స్వగ్రామం చేరుకుంది. మూడు సంవత్సరాల క్రితం రూ. 1.50 లక్షలు అప్పు చేసి విజిట్ వీసాపై దుబాయ్ వెళ్ళిన భీమదేవరపల్లి మండలం రాంనగర్ తండాకు చెందిన భూక్యా వీరన్న (40) గత నెల 26 న గుండెపోటుతో మృతి చెందాడు. ముగిసిన ఏడో ఓ కూలీ పనికి వెళ్తూ నాలుగురాళ్లు కుదబెడుదామనుకున్న అయన అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో కన్ను మూశాడు. ఈ విషయం తెలుసుకున్న వీరన్న స్నేహితులు రాంనగర్ లో ఉంటున్న అయన భార్య సమ్మక్కకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అక్కడి స్నేహితులు, స్వచ్చంద సంస్థ నిర్వాహకుల సాయంతో మృతదేహం గురువారం రాంనగర్కు చేరుకుంది. దీంతో శవపెటికకై పడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరికిని కలచివేసింది. వీరన్నకు ఇద్దరు కుమారులు, శ్రీకాంత్ (17), ఇంటర్ ద్వితీయ సంవత్సరం, ప్రవీణ్ (14) పదో తరగతి చదువుతున్నారు. చేసిన అప్పులు తీరకపోగా సమ్మక్క కూలీ పని చేస్తూ పిల్లలను పోషిస్తుంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు.
________________________________________________________________
మృతదేహం కోసం నెల రోజులుగా పడిగాపులు
ఇబ్రహీంపట్నం, న్యూస్ టుడే; కడసారి చూపు కోసం ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. అనంతలోకాలకు వెళ్ళిన ఆత్మీయుడి మృతదేహం ఎడారి దేశాల నుంచి ఎప్పుడు వస్తుందో తెలియక కన్నీరుమున్నీరవుతోంది. ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్ గ్రామానికి చెందిన దొంచోంద భూమన్న (37) దుబాయిలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడి నెల రోజుల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి భూమన్న మృతదేహం కోసం కుటుంబ సభ్యులు కన్నీటితో ఎదురుచూస్తున్నారు. శవాన్ని తెప్పించుకునే స్థోమత లేక, ఆడుకునే వారు కానరాక నిద్రాహారాలు మాని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఉన్న ఉరిలో ఉపాధి కరవై గల్ఫ్ వెళ్ళిన భూమన్న దుబాయిలో కూలీలను సరఫరా చేసే విక్టోరియా కంపెనీలో పనికి కుదిరారు. కంపెనీ ఇచ్చే 500 ధరమ్స్ వేతనంతో సగం తన ఖర్చులకు ఉంచుకొని మిగితా ఇంటికి పంపేవారు. దీంతో అప్పులు తీరకపోగా మరింత పెరిగాయి. కుటుంబ అవసరాల నిమిత్తం ఉన్న మూడెకరాల పంట భూమిని అమ్ముకున్నా అప్పులు తీరలేదు. ఇటివలే పని చేస్తున్న కంపెనీని వదిలిన భూమన్న కల్లివెల్లి కావడంతో వేతనం కాస్తంత మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు భావించారు. ఈ తరుణంలోనే ఈ నెల 1న భూమన్న వేతనం తీసుకోని తానుంటున్న గదికి తిరిగి వస్తుండగా ఆల్ కోజ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసి హత మార్చినట్లు బంధువుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అప్పటి నుంచి భార్య గంగు ఇద్దరు కుమారులు, ముసలి తల్లిదండ్రులు కన్నిటిలో మునిగారు. భూమన్న మృతదేహాన్ని రప్పించాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చెసినా స్పందన భూమన్న మృతదేహాన్ని తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
గల్ఫ్ బాధితుడి ఆత్మహత్య
సిరిసిల్ల రూరల్, న్యూస్ లైన్ : ఉన్న ఉరిలో ఉపాధి కరువై గల్ఫ్ వెళ్లి అప్పులపాలైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం మండలంలోని చీర్లవంచకు చెందిన జంగపల్లి అంజయ్య (50) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. అంజయ్య రెండుసార్లు గల్ఫ్ వెళ్లి అప్పుల పాలయ్యాడు. అక్కడ జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. ఇద్దరు కూతుళ్ళ పెళ్ళికి చేసిన అప్పు కూడా తీరలేదు. అతడి కొడుకులు శ్రీనివాస్ (20), శ్రీకాంత్(16) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఖర్చులకు డబ్బులడిగిన కొడుకులను అంజయ్య కర్రతో కొట్టి ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
________________________________________________________________
మస్కట్ లో అసువులు బాసిన జూలపల్లి వాసి
చేసిన అప్పులు తీర్చాలన్న తాపత్రయంతో ఎడారి దేశం బాట పట్టిన ఓ నిరుపేద మస్కట్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన మానుమండ్ల రాజయ్య (42) నెలల క్రితం బతుకుదెరువు కోసం అప్పులు చేసి మస్కట్ కు వెళ్ళాడు. పదవ తేదిన అక్కడ పనికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని కంపెనీ అధికారులు స్వదేశానికి పంపించగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరినట్లు బంధువులు తెలిపారు. రాజయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
________________________________________________________________
బెహరాన్ లో మల్యాల వాసి మృతి
ఉపాధి కోసం బెహరాన్ వెళ్ళిన మల్యాల వాసి పుష్పాల గోపాల్ (50) సోమవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు సమాచారం అందింది. ఏడాది క్రితం గోపాల్ బెహరాన్ వెళ్ళాడు. సోమవారం తాను పని చేసే కంపెనికి చెందిన వాహనంలో అతడిని పనికి తీసుకు వెళ్ళడానికి సిబ్బంది వెళ్లి చూడగా గోపాల్ మరణించినట్లు కనుగొన్నారు. ఈ విషయాన్ని కంపెనికి తెలియజేసి శవాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు మృతుడి బంధువులు తెలిపారు. గోపాల్ కుమారునికి ఇటివలే పోతారంనాకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగినట్లు వివరించారు. గోపాల్ మృతదేహాన్ని సాధ్యమైనంత తొందరగా స్వగ్రామం పంపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
________________________________________________________________
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గంగయ్య
దుబాయి లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలం చెప్యాల పరిధిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన బండపల్లి గంగయ్య (45) మృతి చెందాడు. ఈ మేరకు ఇక్కడి కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందింది. గతంలో దుబాయి వెళ్లోచ్చిన గంగయ్య కొద్దికాలం పాటు స్వగ్రామం లో గడిపాడు.ఆరు నెలల క్రితం కంపెనీ వీసాపై తిరిగి దుబాయి వెళ్ళాడు. తన కాలనికే చెందిన గంగాధర శంకరయ్య దుబాయి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నందున అతడు ఉంటున్న క్యాంపస్ వెళ్లి తన కుటుంబ సభ్యుల కోసం గంగయ్య సామగ్రి అందజేశారు. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు అక్కడి వలస కార్మికులు ప్రయత్నిస్తున్నారు.
________________________________________________________________
దుబాయిలో ధర్మసాగర్ పల్లి వాసి అరెస్టు
కోహెడ మండలం ధర్మసాగర్ పల్లికి చెందిన రాగుల మొండయ్య ఏప్రిల్ నెల 15న దుబాయికి వెళ్ళగా అక్కడ పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గతంలో దుబాయిలో పని చేసిన సమయంలో మొండయ్యకు ఒక సెల్ ఫోన్ దొరకగా అది హత్యకు గురైన ఒక వ్యక్తికి సంబంధించినదిగా పోలిసుల విచారణలో వెల్లడైంది. ఆ సెల్ ఫోన్ మొండయ్య వద్ద ఉండటంతో అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం దేశంకాని దేశం పోయిన తన భర్తను అరెస్టు చేయడంతో కుటుంభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
________________________________________________________________
దుబాయిలో నర్సింగాపూర్ వాసి మృతి ఇంటికి చేరిన మృతదేహం
ఉన్న ఉరిలో ఉపాధి లభించక దుబాయి చేరిన ఓ అభాగ్యునికి అక్కడా చుక్కెదురయింది. ఎంతో కొంత పొగ చేసుకొని వెనక్కి వచ్చేద్దామని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా మృత్యువాత పడటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎప్పుడోస్తాడని అతని రాకకోసం ఎదురుచూస్తుండగా శవమై ఇంటికి చేరటంతో ఇంటిల్లిపాది కన్నీరుమున్నేరై విలపించారు. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మద్దెలపల్లి శ్రీనివాస్ (35) వడ్రంగి కార్మికుడు ఉపాధి కోసం గత కొన్నేళ్ళుగా దుబాయి వెళ్తున్నాడు. రెండేళ్ళ క్రితమే వచ్చివేల్లిన ఆటను మరోసారి వచ్చేందుకే సన్నాహాలు చేసుకుంటుండగా వారం క్రితం అనూహ్యంగా అక్కడ మృతి చెందిన సమాచారం తెలిసి కుటంబ సభ్యులు అప్పటి నుంచి మృతదేహం కోసం ఎదురుచూస్తూ కంటి మీద కునుకు లేకుండా గడిపారు. కాగ ఆదివారం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా కన్నీళ్ళ వీడ్కోలు నడుమ అత్యక్రియలు నిర్వహించారు. స్థానిక నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
________________________________________________________________
సౌదీలో మేట్ పల్లి వాసి మృతి
సౌదీలో నాలుగురోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన మేట్ పల్లి వాసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దుబ్బవాడకు చెందిన అబ్దుల్ మజీద్ (38) మూడేళ్ళ క్రితం సౌదిలోని రియాద్ లో డ్రైవర్ గా పని చేయడానికి వెళ్ళాడు. నాలుగు రోజుల క్రితం కారు బోల్తా పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మృతుడి బావమరుదులు అజీద్,ముజీబ్,ముజాహిద్ ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పంపడానికయ్యే ఖర్చులు భరించడానికి యజమాని అంగీకరించలేదు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. మజీద్ మరణవార్త తెలిసిన అతని భార్య సాజీదబేగం, ముగ్గురు కూతుళ్ళు, కొడుకు రోదిస్తున్న తీరు పలువురి హృదయాలను కలచివేసింది.
________________________________________________________________
గల్ఫ్ లో అన్నారం వాసి మృతి…. మృతదేహం కోసం ఎదురు చూపులు
చేసిన అప్పులు తీర్చటం కోసం పొట్ట చేతిలో పట్టుకొని గల్ఫ్ కు వెళ్ళిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన సంఘటన మానకొండూర్ మండలం అన్నరంలో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామస్థుల కథనం ప్రకారం అన్నారం గ్రామానికి చెందిన పొట్టల రవీందర్ (35) అనే వ్యక్తి కూలీ పని చేస్తుకుంటూ జీవిస్తున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు మరో రూ. 90 వేలు అప్పు చేసి ఏడాదిన్నర క్రితం గల్ఫ్ దేశమైన కువైట్ కు వెళ్ళాడు. కాగ శుక్రవారం రవీందర్ కు గుండెపోటు రావటంతో కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొడుకు మృతి చెందడాన్న సమాచారంతో వృద్దదంపతులు ఒకేసారి షాక్ కు గురయ్యారు. మృతునికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుతురులున్నారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం కోసం నాలుగు రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు.
ఎస్పీకి వినతి …
జీవనోపాధి కోసం వెళ్ళిన పొట్టాల రవీందర్ గుండెపోటుతో మృతి చెందగా మృతదేహాన్ని తీసుకురావాలని జిల్లా ఎస్పీకి మృతుడి భార్య అంజమ్మ వినతి పత్రాన్ని సమర్పిచారు. బతుకు దెరువు కోసం అప్పులు చేసి కువైట్ కి వెళ్లి తన భర్త మరనిచగా మృతదేహాన్ని తీసుకువచ్చే ఆర్ధిక స్థోమత తమ వద్ద లేదని మృతదేహాన్ని ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో తీసుకురావాలని వినతి పత్రంతో వారు పేర్కొన్నారు.
________________________________________________________________
గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో కోజన్ కొత్తూర్ వాసి మృతి
దసరా పండుగ ఇంటికి వస్తానని దుబాయి నుంచి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మరునాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అయన రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూర్ లో విషాదం నింపింది. గ్రామంలో ఎలక్ట్రిషియాన్ గా పనిచేసిన చౌడరపు రమేష్ (38) బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్ళాడు. టి.సి.టి అనే కన్ స్ట్రక్షణ్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్న అయన గత బుధవారం విధులకు వెళ్లేందుకు దుబాయి ఈన్వేస్టేమెంట్ పార్కు వద్ద బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడి మృతి చెందాడు. ఈ మేరకు బంధువులు, స్నేహితులు ఆదివారం సమాచారం అందించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గత మంగళవారం ఫోన్ చేసి తాను దసరా పండుగకు ఇంటికి రావడానికి సిద్దమవుతున్నానని తెలిపాడంటూ భార్య రమాదేవి, కొడుకులు అచ్యుత్, అజయ్ లు రోదించడం కలిచివేసింది. గత ఏడేళ్ళ క్రితం సౌదీ అరేబియా వెళ్ళడంతో ఇంకా రూ. 1.50 లక్షల వరకు అప్పు ఉందని మృతుని బంధువులు తెలిపారు. రమేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి వెంటనే తెప్పించాలని గ్రామ సర్పంచి పిండి ముత్తమ్మ, మాజీ సర్పంచి రాఘవులు, ఎంపీటీసి గంగాధర్ లు కోరారు.
________________________________________________________________
దోహా ఖతర్ లో………రామలచ్చక్కపేట వాసి హత్య
మేట్ పల్లి మండలం రామలచ్చక్కపేట గ్రామపంచాయతీ పరిధిలోని అల్లూరి సీతారామయ్యరాజు తండాకు చెందిన గుల్లావాత్ సత్తయ్య (35) దోహఖతర్ లో హత్యకు గురయ్యాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ళ క్రితం అక్కడికి వెళ్ళిన సత్తయ్య తొమ్మిది నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి మరోసారి వెళ్ళాడు. అక్కడ ఎపీసి కంపనీలో లేబర్, సెక్యురిటి గార్డుగా పని చేశాడు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచక పోవడంతో వీసా రద్దు చేసుకొని స్వగ్రామానికి రావాలని ప్రయత్నించాడు. ఇంతలోనే సత్తయ్య హత్యకు గురైనట్లు దోహా ఖతర్ లో ఉన్న తండా వాసులు సోమవారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నిరుమున్నిరుగా రోదిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... సత్తయ్య రంజాన్ పండుగ రోజు హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. ఆ రోజు అక్కడ సెలవు దినం కావడంతో కొందరు మిత్రులు సత్తయ్యను కలిసేందుకు ఫోన్ లో ప్రయత్నించగా ఫోన్ రింగ్ అవుతున్న స్పందన రాలేదు. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. అనుమానం వచ్చిన మిత్రులు నాలుగు రోజుల క్రితం సత్తయ్య ఉండే గదికి వెళ్లి చూడగా సెల్ ఫోన్ మాత్రమే కనిపించింది. ఇంతలో పట్టన శివారులో సత్తయ్య హత్యకు గురైనట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా అతడి నంబరుకు ఫోన్ చేయగా మిత్రులు మాట్లాడారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోని సత్తయ్య ఫోన్ ఎలా వచ్చిందని విచారణ జరిపి వదిలేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. సంఘటన స్తలంలో లభించిన ఆనవాళ్ళను బట్టి సత్తయ్యను కర్రలతో కొట్టి హత్య చేసినట్లు భావిస్తున్నారు. మ్రుతుడికి తల్లి గంగు, భార్య సుగుణ, కూతురు సుమలత(12), కొడుకు వినోద్ (11) ఉన్నారు. సుమలత కరీంనగర్ లో ఏడో తరగతి చదువుతుండగా, వినోద్ స్థానిక పాటశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సత్తయ్య హత్యలో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. తండాలో విషాదం నెలకొంది.
________________________________________________________________
స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన ఓ వ్యక్తి గల్ఫ్ లో గుండెపోటుతో మరణించగా మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరింది. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన పుప్పల నరేంద్ర (37) ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్ళాడు. అక్కడ 3 ఆర్ఎస్ టెక్నికల్ సర్వీసెస్ 15 ఏళ్లుగా ప్రాజెక్టు ఇంజనీర్ హోదాలో పని చేస్తున్నారు. జూలై 30 న విధి నిర్వహణలో ఉన్న నరేంద్రకు గుండె నొప్పి రావడంతో అతని మిత్రులు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ మృతి చెందారు. మృతదేహం స్వగ్రామానికి రాగానే బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మ్రుతుడికి భార్య స్నేహలత, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.
________________________________________________________________
స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
గుండెపోటుతో దుబాయిలో మృతి చెందిన మల్లాపూర్ మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన దాసరి రాజారెడ్డి(34) మృతదేహం స్వగ్రామం చేరడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మూడేళ్ళుగా దుబాయిలోని కొరియా ఎల్ఎల్సి కంపనిలో రాజారెడ్డి పని చేస్తున్నాడు. ఈ నెల 20 న గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. వారం రోజుల అనంతరం మృతదేహం స్వగ్రామం చేరడంతో అంత్యక్రియలు నిర్వహించారు. శవయాత్రలో సర్పచ్ ఆనంద్ గౌడ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
________________________________________________________________
సౌదీలో జగిత్యాల వాసి మృతి
జగిత్యాల ఇస్లంపురాకు చెందిన షేక్ హుసేన్ శుక్రవారం సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. షేక్ హుసేన్ తో పాటు అతని కుమారుడు అఫ్రోజ్ లు ఉపాధి రిత్యా గత కొంతకాలంగా సౌదీలో నివసిస్తున్నారు. వీరిద్దరూ ఓ వాహనం లో జెడ్డాకు వెళ్తుండగా ఎదురుగ వచ్చిన వాహనం దీకోట్టడంతో తండ్రి షేక్ హుసేన్ మృతి చెందగా కుమారుడు అప్రోజ్ రెండు కాళ్ళు విరిగినట్లు జగిత్యాలకు సమాచారం అందింది. దీంతో వారి కుటుంబ సభ్యులు విషాదం లో మునిగిపోయారు. షేక్ హుసేన్ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
________________________________________________________________
దుబాయిలో మరో బడుగు జీవి మృతి
మేడిపల్లి మండలం కాచారం గ్రామానికి చెందిన బడుగు అంజయ్య (37) దుబాయిలో ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఇక్కడికి సమాచారం అందింది. సందర్శక వీసాపై వెళ్ళిన అంజయ్య అక్కడ భవన పనులు నిర్వహించేవాడు. ఈ నెల 23న ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడటంతో మృతి చెందాడు. ఆయనకు భార్య కొడుకు, కూతురు ఉన్నారు. ఆర్థికంగా తీవ్ర నష్టపోయిన అంజయ్య సందర్శక వీసాపై వెళ్ళడంతో అక్కడి భీమా నిబంధనలు వర్తించవు. కాగ అతడి మృతదేహాన్ని ఇంటికి చేర్పించాలని సర్పంచ్ కొప్పెర లింగా రెడ్డి కోరారు.
________________________________________________________________
ఒమన్ లో లక్ష్మీపూర్ వాసి మృతి
రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామస్తుడు కల్లేపల్లి లచ్చయ్య ఒమన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గత నెల 24 న కంపెనీ వాహనంలో క్యాంపు కార్యాలయానికి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగినట్టు అయన బంధువులు తెలిపారు. ఈ సంఘటనలో కల్లేపల్లి లచ్చయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో ఒమన్ నుంచి మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం తరలించారు. కల్లేపల్లి లచ్చయ్య స్వగ్రామంలో ఉపాధి లేక ఇరవైయేళ్ళ క్రితం ఒమన్ దేశానికి వలస వెళ్ళినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా లక్ష్మీపూర్ కు మృతదేహాన్ని తరలించారు. గ్రామస్తుల పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు.
________________________________________________________________
ఆఫ్గనిస్తాన్ లో బొంకూర్ వాసి మృతి మృతదేహాన్ని రప్పించడానికి గ్రామస్తుల విరాళం
డబ్బు సంపాదించాలని అప్పులు చేసి ఆఫ్గనిస్తాన్ వెళ్ళిన ఓ నిరుపేద వ్యవసాయ కూలీ అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామస్తుల విరాళాలు సేకరిస్తున్నారు. ఈ హృదయ విచారక సంఘటన గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూరమల్ల రాములు (38) అనే నిరుపేద వ్యవసాయ కూలీ ఏడాది క్రితం రూ. 1.20 లక్షలు చెల్లించి ఏజెంట్ ద్వాత ఆఫ్గనిస్తాన్ వెళ్ళాడు. అక్కడికెళ్ళాక కంపెనీ వీసా కాదని, ఏజెంట్ మోసం చేసాడని, కాని ఏజెంట్ గ్రామానికి చెందిన అడ్డుగట్టు చంద్రయ్య అప్పటికే ఢిల్లీ లో అనుమానాస్పద స్తితిలో మృతి చెందాడు. రాములుకు పని దొరకక రాములుకు పని దొరకక ఇంటి నుంచే కర్చులకు డబ్బులు తెప్పించుకుంటూ కలం గడిపాడు. ఈ క్రమం లో తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురావటానికి రూ. 80 వేలు అవసరమని తెలుపడంతో కుటుంబసభ్యులు సర్దుబాటు చేసుకునే పరిస్టితి లేకపోవటం తో గ్రామస్తులే విరాళాలు సేకరిస్తున్నారు.
________________________________________________________________
స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం
ఉపాధి కోసం సౌదీకి వెళ్లి అక్కడ అనారోగ్యంతో మృతి చెందిన మానాల వాసి అల్లూరి అంజన్న (50) మృతదేహం మంగళవారం స్వగ్రామం చేరింది. మృతదేహాన్ని చుసిన కుటుంబసభ్యులు బోరున విలంపించారు. గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు.అనంతరం అంత్యక్రియల నిర్వహించారు. 22 రోజుల తర్వాత శవం స్వగ్రామం చేరింది. ఉపాధి నిమిత్తం వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన దుబాయి సంక్షేమ సంఘంలో అంజన్న సభ్యుడిగా ఉన్నాడు. శనివారం స్వగ్రామం చేర్చడంలో బాల్కొండ ఎమ్మేల్యే ఈరవత్రి అనిల్ తో పాటు దుబాయి సంక్షేమ సంఘం సభ్యులు ప్రత్యెక చొరవ తీసుకున్నారు. మ్రుతుడికి భార్య లక్ష్మి,ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు.
________________________________________________________________
ఏజెంట్ ఇంటి ముందు బాధితుల ఆందోళన గ్రామస్తుల జోక్యంతో విరమణ
గల్ఫ్ పంపిస్తానని ఓ ఏజెంట్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆరున నెలలుగా గల్ఫ్ పంపిస్తాడని వేచి చూసి విసిగి వేసారిన బాధితులు ఆదివారం సదరు ఏజెంట్ ఇంటి ముందు క్రిమిసంహారక మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని ఆందోళన చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన మద్దుల బుగ్గరేడ్డి గల్ఫ్ పంపిస్తానని ముస్తాబాద్ మండలం కొండాపూర్ కు చెందిన సబ్ ఏజెంట్ బండి శ్రీనివాస్ ద్వార రూ. 3.90 లక్షలు వసూలు చేశాడు. దుర్గం చంద్రారెడ్డి, ఐలేని చంద్రం, కొండెం వెంకటరెడ్డి, బండి నర్సయ్యలను ఇరాక్ పంపిస్తానని డబ్బులు వసూలు చేశారు. మూడు నెల తర్వాత వారిని ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఇంటికి తీసుకువచ్చాడు. సబ్ ఏజెంట్ శ్రీనివాస్ తన భూములను అమ్మి నలుగురికి డబ్బులు చెల్లించాడు. బుగ్గరేడ్డి మాత్రం శ్రీనివాస్ కు డబ్బులు ఇవ్వక జాప్యం చేస్తువచ్చాడు. దీంతో విసిగిపోయిన శ్రీనివాస్ తన భార్య మంజుల, తల్లితండ్రులు మల్లయ్య, శాంతవ్వ, కుమారులు సాయిప్రసాద్, సతీష్ కుమార్ లతో కలిసి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని బుగ్గరేడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు వచ్చేల ఒత్తిడి తేవాలని సముదాయించడం తో శ్రీనివాస్ ఆందోళనను విరమించాడు. గ్రామస్తుల హామిమేరకు స్వగ్రామానికి తిరిగి వెళ్ళాడు.
________________________________________________________________
నారాయణ
సౌదీలో ఆర్మూర్ వాసి మృతి
పట్టణంలోని జేమ్మన్ జెట్టిగల్లికి చెందిన ఉట్నూర్ నారాయణ (32) సౌది అరేబియాలోని దమామ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ సంవత్సరం క్రితం బతుకుదెరువు నిమిత్తం ఐదేళ్ళ క్రితం దమామ్ వెళ్ళాడు. గల్ఫ్ వెళ్ళడానికి అప్పులు చేశారు. అప్పు ఇచ్చిన వారు తమ డబ్బులు చెల్లించాలని ఆర్మూర్ లోని నారాయణ కుటుంబీకులపై ఒత్తిడి చేశారు. అక్కడ జీతం తక్కువగా ఉండడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక జీవితం మీద విరక్తి చెందిన దమామ్ లో తన గదిలో నాలుగు రోజుల క్రితం ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. మృతదేహాన్నిఆర్మూర్ కు తీసుకువచ్చే ఏర్పాటు చేయాలనీ స్తానిక నాయకులు ఎంపీ మధుయాష్కిగౌడ్ ను కలిసి కోరారు. ఎంపీ సౌది అరేబియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులకు ఈ విషయమై లేఖ రాసినట్లు తెలిసింది. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
________________________________________________________________
గల్ఫ్ లో యశ్వంతరావుపేట వాసి మృతి
బతుకుదెరువు కోసం కన్నవారిని విడిచి ఎడారి బాట పట్టిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బరువైన వస్తువు మీద పడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో పండుగ రోజు తీరని విషాదం అలుముకుంది. మండలంలోని యశ్వంతరావుపేటకు చెందిన మందాల రమేష్ (28) అనే యువకుడు 18 నెలల క్రితం అప్పులు చేసి దుబాయి వెళ్ళాడు. అక్కడే ఓ కంపనీలో క్రేన్ ఆపరేటర్ గా పని చేసేవాడు. ఈ క్రమంలో గత శనివారం పై అంతస్తులో పనులు నిర్వహిస్తున్న క్రమంలో బలమైన వస్తువు మీద పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అతడి స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. మృతుడికి భార్య రామ, ఈశ్వర్ (6), రిశ్వంత్ (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా అదే కంపనిలో గల్ఫ్ లో ఉంటున్న రమేష్ మూడేళ్ళ అనంతరం 10 నెలల క్రితం వచ్చి వెళ్ళాడు. గల్ఫ్ కోసం చేసిన అప్పులు తీరకముందే మృతి చెందటంతో యశ్వంతరావుపేట విషాదంలో మునిగిపోయింది. మరణ వార్త తెలియగానే అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామం చేరేల ఏర్పాట్లే చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకుకోవాలని సర్పంచ్ తాండ్ర సత్యనారాయణ రావు ప్రభుత్వాన్ని కోరారు.
________________________________________________________________
సౌదీలో దుంపేట వాసి మృతి
ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన మాతే గంగారం అలియాస్ ఎర్దండి (42) సౌది అరేబియాలో మృతి చెందారు. బుధవారం రాత్రి గుండెపోటుతో అతడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు గురువారం సమాచారం అందింది. గంగారం పది నెలల కిందట రూ 1.50 లక్షలు అప్పుచేసి సౌది అరేబియా వెళ్లి దమామ్ ప్రాంతంలో పని చేస్తున్నారు. మ్రుతుడికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు.
________________________________________________________________
సౌదీలో తెర్లుమద్ది యువకుడి మృతి
మండలం లోని తెర్లుమద్దికి చెందిన ఎం.డీ. ఎక్బాల్ (24) సౌదీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ దుర్వార్త కుటుంబీకులు, బంధువులకు ఆదివారం రాత్రి తెలిసింది. మృతుడి అన్న గపూర్, మేనమామ ఉస్మాన్ తదితరులు విలేకరులకు సోమవారం తెలిసిన వివరాల ప్రకారం.... గ్రామంలో ట్రాక్టర్ ద్రివేరుగా పని చేసే ఎక్బాల్ ఆర్థికంగా నిలదొక్కుకోడానికి రెండేళ్ళ కిందట రెండు లక్షల అప్పుచేసి గల్ఫ్ కు వెళ్ళాడు. అక్కడ ఓ కంపనీలో పని చేస్తున్నాడు. కాగ శనివారం కూరగాయలు తెచ్చుకోవడానికి
రోడ్డు దాటుతుండగా ఓ కారు వచ్చి డీకొట్టడంతో అతడు మృతి చెందాడు. ఈ విషయాన్ని అక్కడే ఉంటున్న గ్రామస్తుండొకరు ఫోన్ లో కుటుంబీకులకు తెలియజేశాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీపీ లక్ష్మికిషన్ రావు, సర్పంచ్ లక్ష్మి మల్లేశ్, టీర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కోరుతున్నారు.
________________________________________________________________
సౌది అరేబియాలో చింతకుంట వాసి మృతి మృతదేహం కోసం కుటుంబ సభ్యుల నిరీక్షణ
ఉన్న ఊరిలో ఉపాధి కరవై జీవనోపాధి కోసం ఎడారి దేశాలకు వెళ్ళిన కరీంనగర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఇంటి నుంచి వెళ్ళిన రెండు నెలలకే చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సౌది నుంచి సమాచారం అందడంతో కన్నిరుమున్నిరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... చింతకుంట లోని తారక రామకృష్ణ నగర్ కు చెందిన బోనగిరి బాలయ్య (39) గ్రామంలోనే వ్యవసాయ కూలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకు తెలిసిన ఓ ఏజెంట్ ద్వార సౌది అరేబియాలో వ్యవసాయ కూలి పనిపై వెళ్లేందుకు వీసా పొందాడు. జూలై 20 న సౌది అరేబియా వెళ్ళిన ఆతను వీసా పొందడం కోసం రూ.2 లక్షల అప్పు చేసాడు. అయితే సౌది అరేబియా వెళ్లి రెండు నెలలు అవుతోంది. గత ఆదివారం బాలయ్య చనిపోయాడంటూ సౌదీలో ఉంటున్న బంధువులు బాలయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. అయితే వీసా కోసం చేసిన రూ.2 లక్షల అప్పునకే వడ్డీ కట్టలేని స్తితిలో ఉన్నామని, ప్రస్తుతం పూట గడవడమే భారంగా ఉన్న దుస్థితిలో మృతదేహాన్ని గ్రామానికి తీసుకు రావడానికి రూ.2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ చూసి మృతదేహాన్ని తీసుకు రావడానికి కృషి చేయాలనీ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
________________________________________________________________
ఖతర్ లో బాల్కొండ వాసి మృతి
బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ లోని ఖతర్ వెళ్లి అక్కడ జరిగిన ప్రమాదంలో బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బొండ్ల చిన్నయ్య (38) మృతి చెందాడు. బాల్కొండలోని ఆర్మూర్ గాలికి చెందిన చిన్నయ్య 9 నెలల క్రితం ఖతర్ దేశానికి వలస వెళ్ళాడు. ఆదివారం అక్కడ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మృత్యువాత పడ్డాడు. ఈ విషయం గురువారం ఆలస్యంగా కుటుంబ సభ్యులకు తెలియడంతో తీవ్రంగా రోదించారు. శవాన్ని రప్పించాలని కుటుంబసభ్యులు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు. మృతుడు చిన్నయ్యకు భార్య ఇద్దరు కూతుళ్ళు, కొడుకు ఉన్నారు. చిన్నయ్య కుటుంబ సభ్యులను లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అడ్వయిజర్ జగన్, మాజీ సర్పంచ్ గంగాధర్ పరామర్శించారు.
________________________________________________________________
ఉపాధి వేటలో చితికిన బతుకు
ఉపాధి కోసం ఉన్న ఊరును వదిలి వెళ్ళిన ఓ యువకుడు మృత్యఒడిలోకి చేరుకున్నాడు. చివరికి సాటి తెలుగు వారు సాయం అందించడంతో 17 రోజులకు మృతదేహం స్వగ్రామం చేరుకుంది. బందువుల కథనం మేరకు సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లికి చెందిన న్యాతరి ఓదెలు (38) ఉపాధి కోసం రెండేళ్ళ కిందట షార్జా వెళ్ళాడు. కాగ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓదెలు గత నెల 22వ తేదిన మరణించాడు. ఓదెలు ఇంటి నుంచి షార్జా వెళ్లేందుకు బయలుదేరి ముంబాయి వరకు చేరుకున్నాకా అతని పెద్దకుమారుడు విద్యుధఘాతంతో మృతిచెందాడు. ఈ విషయం అతనికి తెలియకుండా బంధువులు జాగ్రత్తపడ్డారు. ఆరునెలలు షార్జాలో పని చేసిన తరువాత ఒదేలును కంపెనీ వారు విధులనుంచి తొలగించారు. గత కొంత కాలంగా అక్కడే కూలీ పని చేసుకుంటున్నా ఓదెలు అనారోగ్యం బారినపడ్డాడు. మెదడుకు శస్త్ర చికిత్ష కూడా చేయించుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన అయన మృత్యువాత పడ్డాడు. దీంతో షార్జాలో స్థానికంగా ఉన్న తెలుగువారు విరాళాలు పోగు చేసి మృతదేహాన్ని ఐతరాజుపల్లికి పంపించారు. శుక్రవారం మధ్యాహ్నం మృతదేహం స్వగ్రామం చేరుకుంది. ఒదేలుకు భార్య,కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ రవీందర్, ఎంపీటీసి సభ్యురాలు రాజమ్మ కోరారు.
________________________________________________________________
ఉపాధి వేటలో 'చితికి' పోయిన బతుకు గల్ఫ్ నుంచి వచ్చిన యువకుడి ఆత్మహత్య
ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్ళిన ఆ యువకుడిని విధి వెక్కరించింది. గల్ఫ్ కు వెళ్లేందుకు చేసిన అప్పులు అతడిని వేదనకు గురిచేశాయి.ఎల్లారెడ్డిపల్లి మండలం వెంకటాపూర్ కు చెందిన పిట్టల బాల లచ్చయ్య (22) దుబాయి నుంచి వచ్చిన 25 రోజులకే బతుకు 'చితికి' పోయింది. శనివారం రాత్రి ఇంట్లోని ఓ దూలానికి ఉరివేసుకున్నాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. బాల లచ్చయ్య మూడేళ్ళ కిందట రూ. లక్ష బాకీ చేసి దుబాయికి వలస వెళ్ళాడు. రాత్రింబవళ్ళు కష్టపడినా యజమానులు వేతనాలు చెల్లించలేదు. చివరికి ప్రవాసాంధ్రుల విరాళాలతో స్వగ్రామానికి చేరుకున్నాడు. అప్పులు తీరే మార్గం కనిపించక కుమిలిపోయి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు రాజవ్వ, నర్సయ్య రోదనలు వర్జనాతీతం, మృతునికి సోదరులు శ్రీకాంత్, కనకయ్య ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
________________________________________________________________
సౌదీలో గుండె పోటుతో మృతి చెందిన పోచయ్య
కోహెడ మండలం రామచంద్రాపూర్ కు చెందిన బోలుమల్ల పోచయ్య అనే వ్యక్తి సౌది అరేబియాలో గుండె పోటుతో మృతి చెందాడు. మూడు నెలల క్రితం అక్కడికి వెళ్ళిన అతను ఈ నెల 8 వ తేదిన మృతి చెందినప్పటికి కుటుంబసభ్యులకు సమాచారం రాలేదు. అతని భార్య, ముగ్గురు పిల్లలుండగా పెద్ద కొడుకు సంపత్ గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని నాలుగైదు రోజుల్లో తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు మీరంజని హెల్ప్ లైన్ జిల్లా ఇన్ ఛార్జ్ షేక్ చాంద్ షాషా తెలిపారు.
________________________________________________________________
స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం
సిరిసిల్ల మండలం గ్రామానికి చెందిన ఎర్ర బాలరాజు (42) గ్రామంలో కూలీ పనులు చేస్తూ భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. గ్రామంలో ఉపాధి కరువై బాలరాజు మూడేళ్ళ క్రితం రూ. 1.50 లక్షల అప్పు చేసి దుబాయికి వెళ్ళాడని గ్రామస్తులు తెలిపారు. సుతారీ కార్మికుడిగా పని చేస్తుండేవాడన్నారు. ఏడాది క్రితం పెద్ద కుమార్తె ప్రియాంకకు రూ. 3 లక్షల కట్నం ఇచ్చి వివాహం చేసారు. అయితే కుమార్తె పెళ్ళికి వచ్చి పోతే మరో రూ. 2 లక్షలు అప్పులు చేయల్సివస్తుందని పెళ్ళికి రాకుండా అక్కడే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగకు డబ్బులను పంపించాలంటూ భార్య దుర్గవ్వ బాలరాజుకు ఫోన్ చేయడంతో డబ్బులను పంపించేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలరాజును కారు డీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అదే ప్రాంతంలో ఉన్న జిల్లెలకు చెందిన కొందరు గ్రామస్తులకు సమాచారం అందించారు. చందాలు పోగు చేసి జిల్లెలకు మృతదేహాన్ని తరలించారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబం రోదనలు మిన్నంటా.
________________________________________________________________
సౌది జైల్లో జిల్లా వాసుల నరక యాతన
పట్టించుకోని భారత రాయబార కార్యాలయం,భర్తను విడిపించాలని సత్తమ్మ వేడుకోలు సౌదీ అరేబియా జైల్లో మగ్గుతున్న ప్రవాస భారతీయులు నరకాన్ని చవిచూస్తున్నారు. ఆదుకుంటుదనుకున్న భారత రాయబార కార్యాలయం స్పందించకపోవడం, అక్కడి అధికారులు శ్రుతిమించి వ్యవహరించడంతో జైల్లో మగ్గుతున్న జిల్లా వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. అలికిడైతే చాలు ఏమి జరుగుతుందోనని ఉలిక్కిపడుతున్నారు. ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తామ అని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన పాల్తేపు జలపతి 2008 ఏప్రిల్ 24 న బతుకు దెరువు కోసం ఆజాద్ వీసాపై సౌదీ అరేబియా వెళ్ళాడు. అక్కడ కపిల్(దళారీ) జలపతి పాసుపోర్టును తీసుకోని పనిలో నియమించుకున్నాడు. మూడు నెలల పని సాఫీగా చేశాక విదుల్లోనే ప్రమాదం జరిగి జలపతి కాలు విరిగింది. ఆజాద్ వీజాపై పనిచేస్తుండడంతో సొంత డబ్బులతో వైద్యం చేయించుకోవాలని దళారీ జలపతిని సూచించాడు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా అక్కడి పోలీసులు పాసుపోర్టు లేదనే నెపంతో అరెస్ట్ చేసి రియాద్ సఫార్ జైల్లో (జీఎంసి) లో పెట్టారు. పాసుపోర్టు కోసం తుదికంట ప్రయత్నించిన దళారీ పాసుపోర్టును ఇవ్వకపోవడంతో జలపతి సౌదీ జైల్లోనే మగ్గుతున్నాడు. జలపతితో పాటే జైళ్లో చేరిన కేరళకు చెందిన ఓ యువకుడు తిండిలేక తమ కళ్ళెదుటే మరణించాడని జలపతి మంగళవారం రాత్రి ఫోన్ లో వాపోయాడు. జలపతితో పాటే జగిత్యాల మండలం హిమ్మత్ రావు పేట గ్రామానికి చెందిన కొండయ్యతో పాటు మరికొంత మంది జిల్లా వాసులు సౌదీ జైళ్లో మగ్గుతున్నారని వారు తెలిపారు. తన భర్త సౌదీ జైళ్లో దుర్బర జీవితం గడుపుతున్నాడని తెలిసిన భార్య సత్తమ్మ తిండి తిప్పలు మాని భర్త తిరిగివస్తే చాలని దేవుడిని వేడుకొంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన భర్తను జైలు నుంచి విడిపించాలని రోదిస్తుంది. రెక్కాడితే గాని డొక్క నిండని పరిస్తితుల్లో జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని సత్తమ్మ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తుంది.
________________________________________________________________
దుబాయ్ రోడ్డు ప్రమాదంలో రేగుంట వాసి మృతి
దుబాయ్ లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన సోమ రాజేశ్వర్ రెడ్డి (32) మృతి చెందినట్లు కుటుంబ సబ్యులకు సమాచారం అందింది. వారి కథనం ప్రకారం రాజేశ్వర్ రెడ్డి నాలుగేళ్ళుగా దుబాయ్ లోని ట్రై ఎలక్ట్రో కంపెనీ లో లేబర్గా పని చేస్తున్నాడు. నాలుగు నెలల కింద సెలవుపై వచ్చి వెళ్ళాడు. శనివారం కంపెనీకి చెందిన వస్తువులను దుబాయ్ నుండి అబుదాబికి ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనుండి వస్తున్న ట్రక్కు డీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి బార్య జల , ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించేందుకు అధికారులు కృషి చేయాలని సర్పంచ్ రామగౌడ్ కోరారు.
________________________________________________________________
దుబాయిలో అనారోగ్యంతో గొండబాబు మరణించాడు
మండల కేంద్రంలోని సుబాస్ నగరుకు చెందినా గొండబాబు (38 ) దుబాయిలో మంగళవారము రాత్రి అనారోగ్యంతో మరణించాడు. అక్కడ ఉన్న తమ బందువుల ద్వార బుధవారము ఉదయము ఈ విషయము తెలిసిందని మృతుడి బార్య గంగమని రోదీస్తూ తెలిపింది. గతేడాది లక్ష రూపాయలు వరకు అప్పు చేసి దుబైలోని అల్కొష్ నగరంలో కూలి కోసం తన బర్త వెళ్ళాడని పేర్కొంది. 6 నెలల క్రితం ఒకసారి నవీపేటకు వచ్చి వెళ్ళాడని ఆమె వివరించింది. తనకు గణేష్ (9) దీపిక (5) ఉందని వెల్లడించింది. ఇప్పుడు తమ పరిస్టితి ఏమిటని ఆమె రోదించింది. ప్రబుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని తన బర్త మృతదేహాన్ని తీసుకురావడానికి కృషి చెయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఎంపిపి సూరిబాబు బాదిత కుటుంబాన్ని పరామర్శించి ప్రబుత్వం తరపున సహాయము అందే విదంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
________________________________________________________________
గల్ఫ్ కు పంపిస్తానని మోసగించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
నిరుద్యోగులైన యువకులను సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు పంపిస్తానంటూ నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై ఆదివారం బాదితులు కమాన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని జూలపల్లి గ్రామానికి చెందిన బోల్లపెల్లి జగన్ గౌడ్ తమను విదేశాలకు పంపిస్తానని రూ.3 లక్షల గ్రామానికి చెందిన మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామానికి చెందిన గుండా నాగరాజు, వెనిశెట్టి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కమాన్ పూర్కు చెందిన మంద రాజయ్య, బాలకృష్ణల వద్ద నుండి జగన్ రూ. 2 .75 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఐ.పి నోటిసులు పంపించారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కమాన్ పూర్ ఎస్.ఐ వెంకటేశ్వర్లును కోరారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన యువకులు 16 మందికి ఇలా ఐ.పి నోటిసులు జారి చేసి జగన్ పరారిలో ఉన్నాడని వారు తెలిపారు.
________________________________________________________________
మస్కట్ లో రోడ్డు ప్రమాదం బూషణ్ రావుపేట వాసి దుర్మరణం
ఉపాదిని వెతుక్కుంటూ స్వగ్రామాన్ని వదిలి గల్ఫ్ బాట పట్టి వలస జీవి మస్కట్ లో ప్రమాదానికి గురై మృతి చెందారు. కథలాపూర్ మండలం బూషణ్ రావుపేట గ్రామానికి చెందిన చేన్నపనేని రమేష్ (35) మస్కట్ దేశంలోని సోహార్ ప్రాంతంలో గురువారం మద్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. రమేష్ ఉపాధి నిమిత్తం 8 సంవత్శరాలుగా మస్కట్ లో నివసిస్తున్నారు. మస్కట్ లోని మోబెలా ప్రాంతంలో అల్సారిజ్ క్లీనింగ్ కంపనిలో ఫొర్మెన్ గా పనిచేస్తునారు. గురువారం కంపెనీ నిమిత్తం కంపెనీ మేనేజర్ లతీఫ్తో కలిసి రమేష్ సోహార్ ప్రాంతానికి కారులో ప్రయాణిస్తుండగా టైర్లు పగిలి కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ అక్కడే మృతి చెందారు. రమేష్ రెండు నెలల క్రితం స్వగ్రామమైన బూషణ్ రావుపేట వచ్చి వెళ్లారు. మృతుడికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కాగ మృతదేహం త్వరగా స్వగ్రామానికి చేరేలా అధికారులు చర్య తీసుకోవాలని బంధువులు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
________________________________________________________________
సౌదీలో ఇద్దరు జిల్లా వాసుల మృతి
గల్ఫ్ లో ఇద్దరు జిల్లా వాసుల మృతి చెందారు. పనులు చేసుకుంటుండగా ఒకరు, జైల్లో శిక్ష అనుభవిస్తూ మరొకరు గుండె పోటుతో మృతి చెందారు. మండలంలోని సముద్రలింగాపూర్ చెందిన కొమ్మన్నపెల్లి సాయిలు (50) , పుట్టయ్య (49) సౌదీలో మరణించారు. సాయిలు మూడేళ్ళ క్రితం గల్ఫ్ వెళ్ళగా అక్కడి పోలీసులకి చిక్కి జైలుపాలై రెండు రోజుల క్రితమే సౌదీకి వెళ్ళగా అక్కడ పని చేసుకుంటుండగానే గుండె ఆగి మృతి చెందాడు. దీంతో వీరి కుటుంబాలు దుఃఖంలో మునిగాయి. మృతులకు బార్య పిల్లలు ఉన్నారు.
________________________________________________________________
అనాధలైన అక్కాచెల్లెళ్లు
కొద్ది నెలల క్రితం తల్లి, నేడు తండ్రి మరణించడంతో ఇద్దరు అక్క చెల్లెలు అనాథలయ్యారు. తండ్రి చితికి పెద్ద కూతురు సోని నిప్పు పెట్టింది. ఈ సంఘటన మండలంలోని ముత్తారంలో బుదవారం జరిగింది. గ్రామానికి చెందిన కడారి కమల, కైలాసం దంపతులకు సోని, సబీనా కుతుర్లున్నారు. కొద్ది నెలల క్రితం కమల మృతి చెందింది. మంగళవారం రాత్రి కైలాసం కూడా మృతి చెందడంతో ఆ అక్కాచెల్లెలు అనాదలయ్యారు. సోని, సబీనా చదువుకు ప్రభుత్వం ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ సర్పంచ్ లజారస్, సర్పంచ్ ఈశ్వరరెడ్డి, ఎంపీటిసి స్రవంతి ప్రభుత్వాన్ని కోరారు.
________________________________________________________________
అప్పుల బాధతో దుబాయిలో మేట్ పల్లి వాసి ఆత్మహత్య
కూలీ పనైనా చేసి కుటుంబానికి అండగా నిలవాలనే లక్ష్యంతో ఎడారి దేశం వెళ్ళిన ఓ వలస జీవి చివరకు అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. మేట్ పల్లి మండలం కొండ్రికర్ల గ్రామానికి చెందిన ఆకుల గంగరాజం (30) కుటుంబ పోషణ కోసం దుబాయికి వెళ్ళాడు. ఈయనకు భార్య కుమారుడు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. దుబాయి హాల్ల అరిన్లోని ఆల్కొస్ కంపనీలో పని చేస్తున్న గంగారాజం చాలిచాలని జీతంలో నానాపాట్లు పడేవాడు. పిల్లలు ముగ్గురు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రూ. 5 వేల జీతం సరిపోక స్వగ్రామంలో చేసిన అప్పులు మరింత భారంగా మారాయి. ఎలాగైనా అప్పులు తీర్చాలని భావించిన గంగరాజం గత ఏడాది స్వగ్రామమానికి తిరిగి వచ్చాడు. తనకున్న 3 ఎకరాల్లో సాగు చేసేందుకు.
________________________________________________________________
ఎయిర్ పోర్టులో వలస జీవి మృతి కుటుంబంలో విషాద ఛాయలు
ఉపాధిని వెతుకుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్లి అనారోగ్యంతో స్వగ్రమమానికి తిరిగి వస్తున్న యువకుడు ఎయిర్ పోర్టులో మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్వగ్రామంలో చేసిన అప్పులను తీర్చేందుకు రాయికల్ కు చెందిన ముక్కెర భూమయ్య (45) ఏడాదిన్నర క్రితం దుబాయ్ వెళ్ళాడు.
కంపెనీ విజాపై వెళ్లినప్పటికీ తక్కువ జీతం ఉండటంతో వెళ్ళిన అప్పులు తీరలేదు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య పిల్లలను చూసుకొని ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వేల్ల్దామని స్వగ్రామానికి బయలు దేరాడు. హైదరాబాద్లోని ఎయిర్ పోర్టు విమానం దిగి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్లి బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మృతి చెందాని చెప్పడంతో బుధవారం రాత్రి రాయికల్ కు తీసుకువచ్చారు. భూమయ్య మరణవార్త తెలియడంతో భార్య, ఇద్దరు కూతుళ్ళు బంధువులు కన్నిరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పుల ఊబిలో ఉన్న గల్ఫ్ భాదితుని కుటుంబాన్ని ఆదుకోవాలని అంబేద్కర్ సంఘం నాయకుడు చెంగ్గలి గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు.
________________________________________________________________
గల్ఫ్ లో చితికిన బతుకు
కూతురు పెళ్ళికి చేసిన అప్పులు తీర్చాలని పరాయి దేశం పయనమై అక్కడే మృత్యువాత పడిన సంగటన మండలంలోని కనగర్తిలో విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సోలుపాటి రంగారెడ్డి (45) ఏడాది క్రితం కూతురు సుమలత పెళ్ళికి రూ. మూడు లక్షల అప్పులు చేశాడు. వీటిని తీర్చడానికి మరిన్ని అప్పులు చేసి బెహరన్ దేశానికి వెళ్లి ఓ కంపనీలో టైర్మెన్ గా పని చేస్తున్నాడు. రోజులాగే సోమవారం సాయంత్రం పనిలో భాగంగా గ్యారేజికి వెళ్తుండగా వాటర్ ట్యా౦కర్ డీ కొట్టింది. అపస్మారక స్తితిలో వెళ్ళిన రంగారెడ్డిని ఆస్పత్రిలో చేర్పించారు. గాయాలు బలంగా తాకడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడని అక్కడే ఉంటున్న బంధువులు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సబ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రంగారెడ్డికి భార్య దేవేంద్ర, ఇద్ద్దరు కూతుళ్ళు సుమలత,మంజుల, కుమారుడు రాజు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ బాపురెడ్డి, ఎంపీటిసి సభ్యుడు రాములు కోరారు.
________________________________________________________________
దుబాయిలో నగునూర్ వాసి మృతి
సారంగాపూర్ మండలం నగునూర్ కు చెందిన సల్లురి చిన్న ముత్యాలు దుబాయిలో అనారోగ్యంతో మృతి చెందాడు. మూడేళ్ళ క్రితం అతను ఉపాధి కోసం వలస వెళ్ళాడు. కొద్ది రోజుల్లో ఇంటికి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా రెండు రోజుల క్రితం మృతి చెందాడు. ముత్యాలుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.