Mercy Support for gulf Indians

MERCY ON SLUMS

గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు అనేకమంది ఏజెంట్ల మోసాలకు గురి అయి తీవ్ర కష్టాలకు లోనవుతున్నారు.వారిని ఆదుకోవడం కోసం కొందరు తెలుగువారు మెర్సీ ఆన్ స్లమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దాని వివరాలను మిత్రులు ఆత్మచరణ్ గల్ఫ్ నుంచి రాసి పంపారు.దానిని ఈ వెబ్ సైట్ లో యధాతధంగా ప్రచురిస్తున్నాము.

మిత్రులారా!

బ్రతుకుదెరువు కొరకు విదేశాలకు అప్పులు చేసి వెళ్ళుతున్న వారు ఎన్నో కష్టాలు పడి వెళ్తుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోని పరిస్తితులవలన ఆకస్మికముగా మరణించిన వారికి సహాయముగా ఉండాలని మరియు మా యొక్క ఆవేధనలతో ఏర్పరచిన MERCY ON SLUMS ఎంతో మంది గల్ఫ్ బాధితులకు ఆధారముగా నిలబడాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము.

గల్ఫ్ వెళ్లేవారికి వెళ్ళే స్తోమత లేకపోయినా కూడా వారు అప్పోసప్పో చేసి, ఏజెంట్లకు లక్షల రూపాయలు కట్టి, నెలల తరబడి వారి చుట్టూ తిరిగి, సొమ్మసిల్లిపోయి ఎదురు చూస్తుంటారు కాని ఏజెంట్లు మాత్రం వారికి నేలకోద్ది మోసగింపు మాటలు చెప్పి నమ్మిస్తారు. ఇలా సమయం గడిచే కొద్ది తీసుకున్న అప్పు సమయం దగ్గర పడుతుంది, ఇటు అప్పు కట్టలేక అటు విదేశాలకు వెళ్ళలేక చాల బాధలు పడుతుంటారు. అయితే కొందరు విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగాలు ఉన్నాకూడా తగిన సంపాదన లేక ఒత్తిడిలకు లోనవుతుంటారు, మరికొందరు సంపాదన ఆశించిన విధముగా ఉన్న కూడా వారి పైఅధికారుల చిన్న చూపుతో వారియొక్క బ్రతుకును గడపడం వారికి పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి బాధలను వారి మనసులో ఆలోచించుకుంటూ వారు ఉద్యోగాలకు వెళ్తున్న సమయంలో ఏ దారి ఎలాగా ధాటుతున్నారో కూడా తెలియకుండా ఆక్సిడెంట్ లకు గురి అవుతున్నారు.

ఇలాంటి ఏజెంట్ల మోసానికి గురవుతున్న వారికి అండదండలుగా ఉండాలన్న సదుద్దేశ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాము.మీ అందరి సహకారంతో ఈ MERCY ON SLUMS ఎంతో మందికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాము. Joel Chandra Mulugu, Bandaru Rajendra Prasad, Ramakrishna Chintha, Kurukelly Atmacharan, Narendher Gorre.
facebook-mercyonslumscreators ; e-mail- mercyonslums@gmail.com

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites