About MERCY Members

ఎడారిలో ఒయాసిస్సులు

ప్రార్థించే పెదవుల కన్నా.. సహాయం చేసే చేతులు మిన్న అని భావించారు. వీళ్లు ఉద్యోగ వేటలో ఎడారి దేశాలకు పరుగులు తీసి అక్కడ మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు నడుంబిగించారు. ఓ సంస్థను స్తాపించారు. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపొయిన కుటుంబాలను ఓదార్చుతూ ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.

ఆర్మూర్, న్యూస్ లైన్

బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు అక్కడ ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబాలు పీకల్లోతు ఆ కుప్పల్లో కురుకుపోతున్నాయి. అలాంటి కుటుంబాలకు ఆడుకోవడానికి ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. దేశం కాని దేశంలో మృత్యువాత పడ్డవారి కుటుంబాలను ఆడుకోవడానికి ప్రభుత్వాలు ముందు రాకున్న తమ వంతుగా ఏమైనా చేయాలనే సంకల్పంతో 'మెర్సి ఆన్ స్లమ్స్' పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశారు. నందిపేట మండలానికి చెందిన బండారు రాజేంద్ర ప్రసాద్, ఆర్మూర్ పట్టణానికి చెందిన కురుకేల్లీ ఆత్మచరణ్, జోయెల్ చంద్ర మూల్గు, ఆర్మూర్ మండలం పిప్రికి చెందిన చింత రామకృష్ణ, అంకాపూర్ కు చెందిన నరేందర్ మోరే ఇరాక్, సౌది అరేబియాలో పలు కంపనిల్లో పని చేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వీరంతా దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ తమ ప్రాంతానికి చెందిన వారు అక్కడికి వచ్చి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. వాళ్ళకు ఏమైనా చేయాలనుకుని 'మెర్సి ఆన్ స్లమ్స్" అనే సంస్థను ఏర్పాటు చేశారు. విదేశాల్లో పలు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా మార్చ్ లో మలేషియాలో ప్రమాదవశాత్తు మరణించిన భీమ్ గల్ మండలం బడా భీమ్ గల్ కు చెందిన నాగన్న కుటుంబ సభ్యులకు 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటివల బహ్రేయీన్లో ప్రమాదవశాత్తు మరణించిన ఆదిలాబాద్ జిల్లా దిలావర్ పూర్ మండలం బన్సపల్లి గ్రామానికి చెందిన పోలా ముత్యం కుటుంబానికి 10 వేల ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. దేశ విదేశాల్లో ఉన్న వీరంతా పోగు చేసిన మొత్తాన్ని చెక్కు రూపంలో ఆర్మూర్ ప్రాంతంలో ఉంటున్న వారి కుటుంబ సభ్యులైన కోటేశ్వర్ రావ్, సూరజ్ లకు పంపుతారు. వీరిఇద్దరూ బాధిత కుటుంబాలను కలిసి స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు సమక్షంలో డబ్బులు అందజేస్తున్నారు.

• మెర్సి ఆన్ స్లమ్స్ స్థాపించిన ఆర్మూర్ వాసులు
• గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం
• దేశ విదేశాలకు విస్తరిస్తున్న వైనం

విస్తరిస్తున్న సేవలు........
స్నేహితుల మధ్య ప్రారంభమైన ఈ సేవలను మరింత విష్రుత పరచి భాదితులను ఆడుకోవడానికి వారు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇంటర్నెట్ సహకారంతో తమ సంస్థలో మరింత మంది సభ్యులను చేర్చుకుంటున్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలను వీరిని పలువురు అభినందిస్తున్నారు.


గల్ఫ్ బాధితులను ఆడుకోవడానికి


బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన మనోళ్ళు కష్టపడతున్నారు. అలాంటి వారిని ఆదుకోవాలనే సంకల్పంతో మెర్సి ఆన్ స్లమ్స్ సంస్థను ఏర్పాటు చేశాం.

బండారు రాజేంద్ర ప్రసాద్, నందిపేట




బాధిత కుటుంబాలకు ఆసరా


గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎంతో కొంత ఆసరాగా నిలవాలనే ఈ సంస్థను ఏర్పాటు చేశాం. పెద్ద దిక్కు చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడుతోంది. వారికి కొంతైనా ఆసరా కావాలన్నదే మా ఆశ.

జోయెల్ చంద్ర మూల్గు, ఆర్మూర్



తోచిన సహాయం చేస్తున్నాం



గల్ఫ్ దేశాల్లో అకాల మరణం చెందిన వారి కుటుంబాలు అప్పుల పాలై దీన స్తితికి చేరుకుంటున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే మాకు తోచిన సహాయం చేస్తున్నాం.

కురుకేల్లీ అత్మచరన్, ఆర్మూర్



ప్రతి ఒక్కరు ముందుకు రావాలి


గల్ఫ్ బాధిత కుటుంబాలను ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి. వారిని ఆదుకోవడానికి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.

చింత రామకృష్ణ, ఆర్మూర్

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites