గల్ఫ్ మృతుల కుటుంబాలకు బాసట "మెర్సి ఆన్ స్లమ్స్"
ఆర్మూర్, ఏప్రిల్4 (ఆన్ లైన్) బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ వెళ్లి మృతి చెందినా వారి కుటుంబాలను ఆదుకోవాలని ఇరాక్ లోని తెలుగువారు నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆంధ్రజ్యోతి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా టబ్లాయిడ్లల లో ప్రచురితమైన గల్ఫ్ మృతుల కుటుంబాల దీనగాతలకు వారు చలించిపోయారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి సాయంతో రెండు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇరాక్ కేంద్రంగా ప్రవాసీయులు నడుపుతున్న "మెర్సి ఆన్ స్లమ్స్" సంస్థ ముందుకు వచ్చింది. చెత్తకుప్పలు, మురికివాడల్లో మగ్గుతున్న పిల్లల, కుటుంబ పెద్దల్ని కోల్పోయి భవిష్యత్ అందకారంగా మారిన చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు పలు కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతుంది.
ఇటివల నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బడా భీమ్ గల్ కు చెందిన కొండూర్ నాగన్న (50) మలేషియాలో మరణించారు. ఆదిలాబాద్ జిల్లా బంసపల్లి చెందిన పోలా ముత్యం (33) కూడా గల్ఫ్ లో మరణించారు. వీరు గల్ఫ్ లో మరణించినట్లు ఆంధ్రజ్యోతి లో కథనం రాగ వీరి కుటుంబాలను ఆదుకుంటామని "మెర్సి ఆన్ స్లమ్స్" ప్రతినిధులు ప్రకటించారు. బ్రతుకు దెరువు కోసం వచ్చి గల్ఫ్ లో మరణించడం తమనేంతో బాదించిందని ఆ పేద కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్ ను కాపాడేందుకు ఆర్ధిక సాయం చేసేందుకు సిద్దమయ్యామని సంస్థ ప్రతినిధులు జోయెల్ చంద్ర అలియాస్ చంద్రకుమార్ మూల్గు, బండారు రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ చింత తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరు ఇరాక్ లోని కేబీఆర్ అనే అమెరికన్ కంపెనీ ఉద్యోగులు.
ఉదయించే సుర్యిడిలా చిగురిస్తున్న చిన్నారులకు, మన జాతీయ జెండా అనే ఇల్లు నుండి పావురమువలె ఎగిరిపోతున్న గల్ఫ్ వారికి మరియు ఎదిక్కు లేని వారికీ ఆధారముగా నిలబడుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మరియు మీ అందరి సహకారంతో ఈ యొక్క MERCY ON SLUMS -Let's Help Together ఎంతో మందికి అండగా నిలబడుతుందని కోరుకుంటున్నాము.
Mercy Description
బ్రతుకుదెరువు కొరకు అప్పులు చేసి విదేశాలకు వెళ్ళుతున్న వారు ఎన్నో కష్టాలు పడి వెళ్తుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోని పరిస్తితులవలన ఆకస్మికముగా మరణించిన వారికి మరియు ఏజంట్ల చేత మోసపోతున్న వారికి సహాయముగా ఉండాలని మరియు మా యొక్క ఆవేధనలతో ఏర్పరచిన మన MERCY ON SLUMS ఎంతో మంది గల్ఫ్ బాధితులకు ఆధారముగా నిలబడుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.