Speech of The Gulf

Mercy Logo Made by Hindustan Flag similar color

గల్ఫ్ బాధితులను ఆడుకోవడానికి


బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన మనోళ్ళు కష్టపడతున్నారు. అలాంటి వారిని ఆదుకోవాలనే సంకల్పంతో మెర్సి ఆన్ స్లమ్స్ సంస్థను ఏర్పాటు చేశాం.

బండారు.రాజేంద్ర ప్రసాద్, నందిపేట



బాధిత కుటుంబాలకు ఆసరా


గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎంతో కొంత ఆసరాగా నిలవాలనే ఈ సంస్థను ఏర్పాటు చేశాం. పెద్ద దిక్కు చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడుతోంది. వారికి కొంతైనా ఆసరా కావాలన్నదే మా ఆశ.

జోయెల్ చంద్ర మూల్గు, ఆర్మూర్


ప్రతి ఒక్కరు ముందుకు రావాలి


గల్ఫ్ బాధిత కుటుంబాలను ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి. వారిని ఆదుకోవడానికి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.

చింతరామకృష్ణ,ఆర్మూర్


గల్ఫ్ మృతుల కుటుంబాలకు బాసట

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన ప్రవాసీయులు ఆర్థిక సాయానికి ముందుకు వచ్చిన "మెర్సి ఆన్ స్లమ్స్"

ఆర్మూర్, ఏప్రిల్4 (ఆన్ లైన్): బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ వెళ్లి మృతి చెందినా వారి కుటుంబాలను ఆదుకోవాలని ఇరాక్ లోని తెలుగువారు నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆంధ్రజ్యోతి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా టబ్లాయిడ్లల లో ప్రచురితమైన గల్ఫ్ మృతుల కుటుంబాల దీనగాతలకు వారు చలించిపోయారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి సాయంతో రెండు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇరాక్ కేంద్రంగా ప్రవాసీయులు నడుపుతున్న "మెర్సి ఆన్ స్లమ్స్" సంస్థ ముందుకు వచ్చింది. చెత్తకుప్పలు, మురికివాడల్లో మగ్గుతున్న పిల్లల, కుటుంబ పెద్దల్ని కోల్పోయి భవిష్యత్ అందకారంగా మారిన చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు పలు కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతుంది.

ఇటివల నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బడా భీమ్ గల్ కు చెందిన కొండూర్ నాగన్న (50) మలేషియాలో మరణించారు. ఆదిలాబాద్ జిల్లా బంసపల్లి చెందిన పోలా ముత్యం (33) కూడా గల్ఫ్ లో మరణించారు. వీరు గల్ఫ్ లో మరణించినట్లు ఆంధ్రజ్యోతి లో కథనం రాగ వీరి కుటుంబాలను ఆదుకుంటామని "మెర్సి ఆన్ స్లమ్స్" ప్రతినిధులు ప్రకటించారు. బ్రతుకు దెరువు కోసం వచ్చి గల్ఫ్ లో మరణించడం తమనేంతో బాదించిందని ఆ పేద కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్ ను కాపాడేందుకు ఆర్ధిక సాయం చేసేందుకు సిద్దమయ్యామని సంస్థ ప్రతినిధులు జోయెల్ చంద్ర అలియాస్ చంద్రకుమార్ మూల్గు, బండారు రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ చింత తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరు ఇరాక్ లోని కేబీఆర్ అనే అమెరికన్ కంపెనీ ఉద్యోగులు.

స్థానికంగా ఉపాది లేక అప్పోసోప్పో చేసి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రధానంగా యువకులు గల్ఫ్ వెళ్తున్నారు. అక్కడ ఏదైనా ప్రమాదంలో మృతి చెందితే ఇక కుటుంబం ఆశలు, ఆధారం కోల్పోయినట్లే. నెలల తరబడి ఎదురు చూసిన మృతదేహం స్వదేశానికి చేరదు. అది వచ్చేవరకు ఏడ్చే కన్ను ఆగదు. మరోవైపు కుటుంబ పెద్దను కోల్పోవడంతో అప్పుల వారి వేధింపులు తీవ్రమవడంతో పలు పేద కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డు పాలవుతున్నాయి. ఇలాంటి కుటుంబాల్లోని పిల్లలది మరి దారుణం. భవిష్యత్ అంతా అందకారంగా మారిపోతుంది. అలంటి పరిస్తితే నాగయ్య. ముత్యం కుటుంబాలది. అలాంటి పిల్లల కోసమే కొంతలో కొంత సాయనికైనా మేం సిద్దమవుతున్నాం. ఆంధ్రజ్యోతి సహకారంతో బాధిత కుటుంబాలకు సాయపడాలని నిర్ణయించుకున్నాం,, అన్నారు జోయెల్ చంద్ర. మానవతా మూర్తులు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని ఆ కుటుంబాలను కోరుతున్నారు. నాగన్న భార్య ప్రస్తుతం బడా భీమ్ గల్ లోనే ఉంటోంది. ఆ కుటుంబానికి సాయపడలనుకునే దాతలు mersyonslums@gmail.com సంప్రదించవచ్చు.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites