MERCY ON SLUMS -Let's Help Together

Well come to the MERCY ON SLUMS -Lets Help Together We are not following by religion or regional but we are following by HUMANITY. Please do support us to give gift of life to Gulf Indians and Children.

MERCY ON SLUMS -Let's Help Together

The saffron represents courage, sacrifice, patriotism, and renunciation.

MERCY ON SLUMS -Let's Help Together

The white is in the center, symoblizing the hope for Truth, Unity and Peace.

MERCY ON SLUMS -Let's Help Together

The green color shows the Indian culture, agriculture, Indian people and complete geographical history of our country. The color also tells about our relation to soil and our relation to environment.

MERCY ON SLUMS -Let's Help Together

Mercy On Slums Logo is made of Indian Flag color, Saffron, White and Green. Mahatma Gandhi and Mother Teresa are included in our Logo.

Srinivas Died in Dubai


దుబాయిలో నర్సింగాపూర్ వాసి మృతి ఇంటికి చేరిన మృతదేహం

ఉన్న ఉరిలో ఉపాధి లభించక దుబాయి చేరిన ఓ అభాగ్యునికి అక్కడా చుక్కెదురయింది. ఎంతో కొంత పొగ చేసుకొని వెనక్కి వచ్చేద్దామని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా మృత్యువాత పడటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎప్పుడోస్తాడని అతని రాకకోసం ఎదురుచూస్తుండగా శవమై ఇంటికి చేరటంతో ఇంటిల్లిపాది కన్నీరుమున్నేరై విలపించారు. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మద్దెలపల్లి శ్రీనివాస్ (35) వడ్రంగి కార్మికుడు ఉపాధి కోసం గత కొన్నేళ్ళుగా దుబాయి వెళ్తున్నాడు. రెండేళ్ళ క్రితమే వచ్చివేల్లిన ఆటను మరోసారి వచ్చేందుకే సన్నాహాలు చేసుకుంటుండగా వారం క్రితం అనూహ్యంగా అక్కడ మృతి చెందిన సమాచారం తెలిసి కుటంబ సభ్యులు అప్పటి నుంచి మృతదేహం కోసం ఎదురుచూస్తూ కంటి మీద కునుకు లేకుండా గడిపారు. కాగ ఆదివారం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా కన్నీళ్ళ వీడ్కోలు నడుమ అత్యక్రియలు నిర్వహించారు. స్థానిక నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Abdhul Majid Died in Kuwait


సౌదీలో మేట్ పల్లి వాసి మృతి

సౌదీలో నాలుగురోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన మేట్ పల్లి వాసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దుబ్బవాడకు చెందిన అబ్దుల్ మజీద్ (38) మూడేళ్ళ క్రితం సౌదిలోని రియాద్ లో డ్రైవర్ గా పని చేయడానికి వెళ్ళాడు. నాలుగు రోజుల క్రితం కారు బోల్తా పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మృతుడి బావమరుదులు అజీద్,ముజీబ్,ముజాహిద్ ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పంపడానికయ్యే ఖర్చులు భరించడానికి యజమాని అంగీకరించలేదు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. మజీద్ మరణవార్త తెలిసిన అతని భార్య సాజీదబేగం, ముగ్గురు కూతుళ్ళు, కొడుకు రోదిస్తున్న తీరు పలువురి హృదయాలను కలచివేసింది.

Ravindher Died in Kuwait


గల్ఫ్ లో అన్నారం వాసి మృతి…. మృతదేహం కోసం ఎదురు చూపులు

చేసిన అప్పులు తీర్చటం కోసం పొట్ట చేతిలో పట్టుకొని గల్ఫ్ కు వెళ్ళిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన సంఘటన మానకొండూర్ మండలం అన్నరంలో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామస్థుల కథనం ప్రకారం అన్నారం గ్రామానికి చెందిన పొట్టల రవీందర్ (35) అనే వ్యక్తి కూలీ పని చేస్తుకుంటూ జీవిస్తున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు మరో రూ. 90 వేలు అప్పు చేసి ఏడాదిన్నర క్రితం గల్ఫ్ దేశమైన కువైట్ కు వెళ్ళాడు. కాగ శుక్రవారం రవీందర్ కు గుండెపోటు రావటంతో కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొడుకు మృతి చెందడాన్న సమాచారంతో వృద్దదంపతులు ఒకేసారి షాక్ కు గురయ్యారు. మృతునికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుతురులున్నారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం కోసం నాలుగు రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు.

ఎస్పీకి వినతి …
జీవనోపాధి కోసం వెళ్ళిన పొట్టాల రవీందర్ గుండెపోటుతో మృతి చెందగా మృతదేహాన్ని తీసుకురావాలని జిల్లా ఎస్పీకి మృతుడి భార్య అంజమ్మ వినతి పత్రాన్ని సమర్పిచారు. బతుకు దెరువు కోసం అప్పులు చేసి కువైట్ కి వెళ్లి తన భర్త మరనిచగా మృతదేహాన్ని తీసుకువచ్చే ఆర్ధిక స్థోమత తమ వద్ద లేదని మృతదేహాన్ని ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో తీసుకురావాలని వినతి పత్రంతో వారు పేర్కొన్నారు.

Ramesh Died in Dubai


గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో కోజన్ కొత్తూర్ వాసి మృతి

దసరా పండుగ ఇంటికి వస్తానని దుబాయి నుంచి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మరునాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అయన రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూర్ లో విషాదం నింపింది. గ్రామంలో ఎలక్ట్రిషియాన్ గా పనిచేసిన చౌడరపు రమేష్ (38) బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్ళాడు. టి.సి.టి అనే కన్ స్ట్రక్షణ్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్న అయన గత బుధవారం విధులకు వెళ్లేందుకు దుబాయి ఈన్వేస్టేమెంట్ పార్కు వద్ద బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడి మృతి చెందాడు. ఈ మేరకు బంధువులు, స్నేహితులు ఆదివారం సమాచారం అందించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గత మంగళవారం ఫోన్ చేసి తాను దసరా పండుగకు ఇంటికి రావడానికి సిద్దమవుతున్నానని తెలిపాడంటూ భార్య రమాదేవి, కొడుకులు అచ్యుత్, అజయ్ లు రోదించడం కలిచివేసింది. గత ఏడేళ్ళ క్రితం సౌదీ అరేబియా వెళ్ళడంతో ఇంకా రూ. 1.50 లక్షల వరకు అప్పు ఉందని మృతుని బంధువులు తెలిపారు. రమేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి వెంటనే తెప్పించాలని గ్రామ సర్పంచి పిండి ముత్తమ్మ, మాజీ సర్పంచి రాఘవులు, ఎంపీటీసి గంగాధర్ లు కోరారు.

Sathaiah Died in Qatar


దోహా ఖతర్ లో………రామలచ్చక్కపేట వాసి హత్య

మేట్ పల్లి మండలం రామలచ్చక్కపేట గ్రామపంచాయతీ పరిధిలోని అల్లూరి సీతారామయ్యరాజు తండాకు చెందిన గుల్లావాత్ సత్తయ్య (35) దోహఖతర్ లో హత్యకు గురయ్యాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ళ క్రితం అక్కడికి వెళ్ళిన సత్తయ్య తొమ్మిది నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి మరోసారి వెళ్ళాడు. అక్కడ ఎపీసి కంపనీలో లేబర్, సెక్యురిటి గార్డుగా పని చేశాడు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచక పోవడంతో వీసా రద్దు చేసుకొని స్వగ్రామానికి రావాలని ప్రయత్నించాడు. ఇంతలోనే సత్తయ్య హత్యకు గురైనట్లు దోహా ఖతర్ లో ఉన్న తండా వాసులు సోమవారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నిరుమున్నిరుగా రోదిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... సత్తయ్య రంజాన్ పండుగ రోజు హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. ఆ రోజు అక్కడ సెలవు దినం కావడంతో కొందరు మిత్రులు సత్తయ్యను కలిసేందుకు ఫోన్ లో ప్రయత్నించగా ఫోన్ రింగ్ అవుతున్న స్పందన రాలేదు. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. అనుమానం వచ్చిన మిత్రులు నాలుగు రోజుల క్రితం సత్తయ్య ఉండే గదికి వెళ్లి చూడగా సెల్ ఫోన్ మాత్రమే కనిపించింది. ఇంతలో పట్టన శివారులో సత్తయ్య హత్యకు గురైనట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా అతడి నంబరుకు ఫోన్ చేయగా మిత్రులు మాట్లాడారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోని సత్తయ్య ఫోన్ ఎలా వచ్చిందని విచారణ జరిపి వదిలేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. సంఘటన స్తలంలో లభించిన ఆనవాళ్ళను బట్టి సత్తయ్యను కర్రలతో కొట్టి హత్య చేసినట్లు భావిస్తున్నారు. మ్రుతుడికి తల్లి గంగు, భార్య సుగుణ, కూతురు సుమలత(12), కొడుకు వినోద్ (11) ఉన్నారు. సుమలత కరీంనగర్ లో ఏడో తరగతి చదువుతుండగా, వినోద్ స్థానిక పాటశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సత్తయ్య హత్యలో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. తండాలో విషాదం నెలకొంది.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites