
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గంగయ్య
దుబాయి లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలం చెప్యాల పరిధిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన బండపల్లి గంగయ్య (45) మృతి చెందాడు. ఈ మేరకు ఇక్కడి కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందింది. గతంలో దుబాయి వెళ్లోచ్చిన గంగయ్య కొద్దికాలం పాటు స్వగ్రామం లో గడిపాడు.ఆరు నెలల క్రితం కంపెనీ వీసాపై తిరిగి దుబాయి వెళ్ళాడు. తన కాలనికే చెందిన గంగాధర శంకరయ్య దుబాయి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నందున అతడు ఉంటున్న క్యాంపస్ వెళ్లి తన కుటుంబ సభ్యుల కోసం గంగయ్య సామగ్రి అందజేశారు. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు అక్కడి వలస కార్మికులు ప్రయత్నిస్తున్నా...