Children



మన కుటుంబానికి పిల్లలు దేవుడు ఇచ్చిన వరము, ప్రతి పిల్లలు ప్రత్యేకముగా జన్మించారు, దేవునికి ఇష్టమైన అపురూపము, ప్రేమించు మరియు ప్రేమించబడు.

ఎంతో మంది పిల్లలు వెట్టి చాకిరీ చేయడం, వీధిన పడి తిరగడం, ప్రభుత్వం వారికీ తగిన విధముగా తోడుపడకపోవడం, తెలిసి తెలియని వయస్సులో పిల్లలు రోడ్ల మీద అడుక్కోవడం, సాయంత్రం అయ్యేసరికి ఎ గూటికి చేరాలో తెలియక రోడ్ల మీద పడుకుంటూ, చెత్తకుప్పలో వేసిన వాటిని ఏరుకొని తినడం, కట్టుకోడానికి బట్టలు, తినడానికి అన్నం లేక, ఎంతో మంది అనారోగ్యలతో మరణించడం, మరికొందరు దిక్కుతోచని చిన్నారులు. చిన్న తనంలోనే దొంగతనాలకు అలవాటుపడుతూ, వారి యొక్క భావి తరాలకు చేరగని మచ్చగా నిలిచిపోతున్నారు.

ఒకవేల చిన్నారులకు తల్లిదండ్రులు ఉన్న కుడా,వారి యొక్క తల్లిదండ్రుల పేదరికం వలన, ఆ పసి పిల్లలు కుడా అదే బాటలో నడుస్తున్నారు. ఆ పిల్లలకు చదువుకోవాలని ఎంతో ఇష్టం ఉన్న కుడా, చదువుకోలేని పరిస్థితి. ఎందుకంటే వారికీ సరైన సహాయము లేక, వారికీ ప్రభుత్వం నుండి సరియైన సహాయము అంధక వారు ఆ చెత్త కుప్పల దగ్గరనే మగ్గిపోతున్నారు.
మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటె మనము ఎన్నో కళలు కంటూ ఉంటాము, వారిని ఎంతో గొప్ప వారిగా, వారియొక్క భావిష్యతులో ఉన్నతమైన స్థానం పొందాలని మనము తాపత్రయపడుతూ వారికి ఉన్నత చదువు అందిస్తూ ఉంటాము. మరి ఎ అండ దండ లేని ఈ చిన్నారులకు కనీసం ఒక్క పుట కూడా గడవని వారికి, చదువు చేతికి అందనంత దూరంలో ఉంది.

ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి:

* యవనస్తులైన స్త్రీ పురుషులు చెడు అలవాటులకు భానిసలై, స్త్రీ గర్బం ధరించి, పిల్లలను కని, చేత్తకుప్పలలో, రోడ్ల మీద, ప్రభుత్వ ఆసుపత్రిలలో పడేసి వెళ్ళుతున్నారు, ఆ పసి కంధులను కుక్కలు కొరికి చంపడం. కొందరు అనాధలుగా పెరగడం, రోడ్ల మీద పడి అడుక్కోవడం, ఇట్టి పరిస్థితులను ఎదురుకుంటున్న చిన్నారులు, ఈ లోకములోనే పుట్టడము పాపమా?ఇటువంటి పరిస్థితులను ఎదురుకుంటున్న చిన్నారులకు, మన యువత చేయూత నివ్వాలని వారికీ అండ దండగ నిలిచి, వారిని ఆదుకొని, వారి యొక్క పరిస్థితులను అర్ధం చేసుకొని, వారికీ తగిన చదువు, ఆహరం, బట్టలు, అన్నిటికి తోడుపడి,

ఏ చిన్నారికూడా అమ్మ, నాన్న మరియు బంధుమిత్రులు లేరని వారి మనసులోనికి రాకుండా, మనమంతా వారికీ సహాయముగా ఉండాలని మరియు మా యొక్క ఆవేధనలతో ఏర్పరచిన MERCY ON SLUMS ఎంతో మంది అనాధపిల్లలకు, పేదరికంతో బాధపడుతున్న వారికీ, ఆకస్మిక పరిస్థితులకు గురైన వారికీ, మరియు ఇంకా ఇలాంటి బాధలను ఎదురుకుంటున్న చిన్నారులకు ఆధారముగా నిలబడుతుందని మనస్పూర్తిగా కోరుకుంటూ....
మీ యొక్క MERCY ON SLUMS..!!!


మా యొక్క MERCY ON SLUMS గురించి మీరు మీ స్నేహితులకు, తోటివారికి, మరియు తెలిసిన వారికీ తెలియజేస్తే మాకు తోడుపడిన వారుగా గుర్తించ బడును. మరల మీ ద్వార MERCY ON SLUMS గురించి అందరికి తెలిసే అవకాశాలు ఉన్నాయి. మీరు సహాయం చేయాలి అనుకొంటే మీరు ఎన్నో విధానాలుగా చేయవచ్చు దయ చేసి ఈ క్రింది వివరాలకు సంప్రదించండి. ఈ సమాచారానికైన మేము ఎంతో ఉత్సాహముగా తెలియజేయగలము.


సూచనా: ఇది కులమతాలకు, చిన్న పెద్ద, బేధాలు లేకుండా మానవత్వంతో సాటివారిని ఆదుకోవడానికి కలిసి కట్టుగా తోడుపడాలని కోరుకుంటున్నాము.

వివరములకు : MERCY ON SLUMS.
E-mail : mercyonslums@gmail.com

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites