Life of gulf


గల్ఫ్ బ్రతుకు దెరువులు

బ్రతుకుదెరువు కొరకు ఎడారి దేశానికి వెళ్ళిన వారు అప్పులపాలై, అప్పులు తీర్చ లేక మరణానికి పాలుపడుతున్నారు.
వారికీ గల్ఫ్ వెళ్ళే స్తోమత లేకపోయిన కూడా, వారు అప్పోసోప్పో చేసి, ఏజెంట్లకు లక్షల రూపాయలు కట్టి,నెలల తరబడి వారు ఏజెంట్ల చుట్టూ తిరుగుతూ, సోమ్మసిల్లి పోతున్నారు. ఏజెంట్లు కూడా వారిని పంపిస్తామంటూ నమ్మ పలుకుతున్నారు, వారి చుట్టు నెలల, నెలలు తిప్పిచ్చికుంటున్నారు. అయితే ఇలా సమయం గడిచే కొద్ది తీసుకున్న అప్పు సమయం దగ్గర
పడుతుంది. అప్పు ఇచ్చిన వారు డబ్బులు కట్టమంటూ ఒత్తిడి చేస్తారు. గల్ఫ్ వెళ్ళాలని ఏజెంట్లకు డబ్బులు కట్టినవారు,
ఏజెంట్లు చెప్పిన మాటలు విని నెలల తరబడి వేచి చూస్తుంటారు. ఒక దిక్కు గల్ఫ్ కొరకు అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి మరొక దిక్కు ఈ ఏజెంట్ల మోసగింపు మాటల వింటూ, వీరు ఒత్తిడ్లకు లోనవుతున్నారు. ఆ ఒత్తిడిని వారు మరిచిపోవడానికి మధ్యంత్రాగడం అలవాటు చేసుకొని ధానికి బానిసవులుతున్నారు. వారు కొన్ని నెలల నుండి పడుతున్న ఆ యొక్క బాధలను తట్టుకోలేక, ఇంటి వారితో కుడా తరచూ గొడవలు పడుతారు. మరి కొందరు ఆ పని చేయలేక వారు ఊరిలో తిని తిరుగుతూ,సోమరితనంతో పాటు దొంగతనాలకు మరియు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

గమనిక

ఒక సామాన్యమైన వ్యక్తి గల్ఫ్ వెళ్ళడానికి చేసిన అప్పు తీర్చలేక ఒక సోమరిపోతుల, ఒక దొంగల మరియు ఆత్మహత్యలకు పాలుపడుతున్నారు. కొంత మంది ఏజెంట్లు మాత్రం మాకు తెలిసిన కంపెనీలు ఉన్నాయి అంటు దుబాయి,సౌదీ, బెహ్రాన్, కతర్, ఒమన్,కువైట్,మలేషియా ,ఆఫ్గనిస్తాన్ మరియు ఇరాక్ లకు పంపిస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. వారిని మన దేశంలోని కొన్ని బ్రోకర్ కంపెనీలకు ట్రెయినింగ్ అంటు తిసకుపోతారు, వారికి రాని పనికుడా వచ్చినట్లు సర్టిఫికేట్ తయారు చేసి, మరి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. తీరా కొన్ని రోజుల తర్వాత గల్ఫ్ వెళ్ళడానికి సమయం వచ్చింది అని చెప్పి వారిని విమాన మార్గమున్న పట్టణములలో వారిని ఉంచుతారు.

ఉదాహరణ

హైదరాబాద్, ముంబాయి, చెన్నై, నాగ్ పూర్ మరియు ఢిల్లీ లాంటి పట్టణంలో ఉంచుతారు. అక్కడికి చేరిన తర్వాత 2 రోజులలో మీ ప్రయాణం ఉందని చెప్పి వారికి 2,3 వారాల తర్వాత విమాన టికెట్ మరియు వీసా తీసుకువస్తారు, తీరా విమాన ఆశ్రయానికి వెళ్ళిన తర్వాత అందులోని ఈమిగ్రేషణ్ ఆఫీసర్స్ టికెట్ మరియు వీసా చూసి, ఈ పేరు మీద వీసా ఇష్యూ కాలేదు అని చెప్పి వారిని విమాన ఆశ్రయం బయటికి పంపిస్తారు. మరికొందరు ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేసి తమ దగ్గర పాస్ పోర్టులు పెట్టుకొని పంపిస్తమంటూ మోసగిస్తుంటారు.

కరీంనగర్ జిల్లా, సారంగాపూర్ మండలం రంగపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే గొల్లపల్లి మండలం, శంకరావుపేట చెందిన ఒక గల్ఫ్ ఏజెంట్ కు 2007 డిసెంబర్ లో
రూ 1 .20 లక్షలు మరియు పాస్ పోర్ట్ అప్పగించారు. ఏజెంట్ మాత్రం గల్ఫ్ (విదేశాలకు) పంపించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసాడు.

మరియొక సంఘటన

గల్ఫ్ పంపిస్తామని ఒక ఏజెంట్ మోసానికి పాల్పడ్డాడు. 6 నెలలుగా గల్ఫ్ పంపిస్తాడని వేచి చూసి విసికి చెందిన బాధితులు ఏజెంట్ ఇంటి ముందు క్రిమిసంహార మందు డబ్బాతో ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన కొండాపూర్ కు చెందిన సబ్ ఏజెంట్ ద్వారా రూ 3.90 లక్షలు వసూలు చేసి గల్ఫ్ పంపిస్తామని చెప్పారు. 3 నెలల తర్వాత వారిని ఢిల్లీ వరకు తీసుకువెళ్ళి ఇంటికి తీసుకోని వచ్చాడు. వారిని గల్ఫ్ పంపించలేక ఈ సబ్ ఏజెంట్ ఆయన యొక్క ఆస్తి అమ్మి వారి డబ్బులు తిరిగి ఇచ్చాడు. ,కాని ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఏజెంట్ సబ్ ఏజెంట్ కు డబ్బులు ఇవ్వక జాప్యం చేస్తూ వచ్చాడు. దానితో విసికి పోయిన ఆ సబ్ ఏజెంట్ వారి యొక్క కుటుంబంతో కలిసి ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఏజెంట్ ఇంటి వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గమనిక

ఈ సంఘటనలో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, వారు డబ్బులు కట్టి నెలల తరబడి వేచి చూసి, నోటికి అందిన అన్నం ముద్ద చేజారినట్టుగా ఢిల్లీ వరకు వెళ్లి తిరిగి వచ్చి మరల వారి డబ్బు పొందుటకు ఎన్నో కష్టాలు పడి, వారి యొక్క పనిని మరియు గల్ఫ్ దేశాలకు వెళ్తామని వారి యొక్క బంధుమిత్రులతో పంచుకున్న సంతోషాలన్నీ అడియశాలుగా మిగిలి పోయాయి. ఇలా నలిగినా జీవితాలు మరి ఎన్నోఉన్నాయి. చెప్పుకుంటూపోతే గల్ఫ్ అనే ఒక్క మాట ఎంతో మంది జీవితాలను చిదిమి వేసింది. మరి కొందరు అవమానాలు మరియు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చూడండి ఇలాంటి ఏజెంట్లు చేసిన మోసానికి ఎంతో మంది జీవితాలు బలి అవుతున్నాయి. ఈ సంఘటనలన్నిగల్ఫ్ వెళ్ళడానికి ముందే జరిగినవి, అయితే గల్ఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ పడే కష్టాలను చుద్దాం.

గల్ఫ్ లో చేరిన తర్వాత కష్టాలు

ఏజెంట్లను నమ్ముకొని విదేశాలలో దిగిన తర్వాత, ఏజెంట్లు ఇచ్చిన కంపెనీల గురించి అడిగినప్పుడు , అటువంటి కంపెనీలు ఇక్కడ లేవు అని అక్కడి మనుష్యులు చెప్పినప్పుడు, వీరు నానా ఇబ్బందులు పడుతూ, ఎవరైనా మానవత్వంతో ఏక్కడైనా స్థలం ఇస్తే అందులో ఉంటాము అని తిరుగూతూ ఉంటారు, ఒకవేళ రూమ్ దొరికిన కూడా ఆ చిన్న రూమ్ లోనే 10-15 మంది వరకు ఉంటారు. ఒకరితో ఒకరు వారి యొక్క బాధలను చెప్పుకుంటూ, వచ్చిన దానికి చావో లేక బ్రతుకో ఇక్కడే గడిపేసి, ఏజెంట్లను నమ్ముకొని విదేశానికి వెళ్ళడానికి తెచ్చిన అప్పు తీర్చడానికి, వారు రోడ్ల మీద ఉన్నటిన్లు మరియు బల్దియా డబ్బాలలోనివి అమ్ముకుంటూ, వారు తినడానికి మరియు అప్పు తీర్చడానికి చేస్తారు. వారు రోడ్ల మీద ఉన్న ఆ టిన్లు మరియు బల్దియా వెతుకుతున్న సమయాలలో అక్కడి అధికారులు పోలీసులు) చుస్తే వారిని జైల్లో పెట్టి, బెదిరించి ఇంటి ధారి పట్టేల చేస్తారు.

ఏజెంట్లు చేసిన మోసానికి మరికొందరు నెలల తరబడి పనిలేక, ఇంటి దగ్గరి అప్పు తీర్చలేక గల్ఫ్ లో ఉన్నవారికి మనశ్శాంతి లేక ఇంటికి ఫోన్ చేస్తే, ఇక్కడ అప్పుల వాళ్ళు డబ్బులు ఎప్పుడు కడుతారు అని హెచ్చరిస్తున్నారు అని విన్నపుడు, ఇక ఇంటికి ఫోన్ చేసిన కూడా మనశ్శాంతి లేదు, అని కొందరు మనోధైర్యాన్ని కోల్పోయి, చనిపోవడానికి ప్రయత్నిస్తారు మరియు చనిపోతున్నారు.

మరికొన్ని ప్రాంతాలలో వారికి ఉద్యోగాలు ఉన్నాకూడా తగిన సంపాదన లేక ఒత్తిడిలకు లోనవుతారు. మరికొందరు సంపాదన ఆశించిన విధముగా ఉన్నా కూడా వారి పైఅధికారుల చిన్నచూపుతో వారి యొక్క బ్రతుకును నడపడం వారికి పెద్ద సమస్యగా మారుతుంది, ఇలాంటి బాధలు పడుతూ, వారు రాత్రిపూట వంట చేసుకొని , ఆ ఆహారం ను వారు ప్రొద్దున మరియు మధ్యాహ్న బోజనముగా తింటారు. బాధలతో వారు వారి యొక్క ఉద్యోగాలకు వెళుతున్న సమయంలో మది నిండా ఆలోచనలతో వారు ఎదారి ఎలా దాటుతున్నారో అని కూడా ఆలోచించకుండా రోడ్లు దాటుతున్న సమయంలో ఆక్సిడెంట్ కు గురి అవుతున్నారు.

కానీ ఇంటిదగ్గర మాత్రం తల్లిదండ్రులు, భార్య పిల్లలు, మరియు కుటుంబసభ్యులు ఎప్పుడువస్తాడ అని సంతోషముతో
ఎదురు చుస్తున్న్తారు, కానీ వచ్చేమనిషి ప్రాణంతో కాదు మరణించి వస్తున్నాడని తెలిసే సరికి, ఇంటిని కాపాడే కొడుకు మరణించాడని తల్లిదండ్రులు నిరువిల్లిపోతారు, ఎన్నో సంవత్సరాల తర్వాత భర్త తిరిగి వస్తాడు అనుకుంటే శవమై రాగానే భార్య జీర్ణించుకోలేక ఆమె తల్లడిల్లిపోతుంది, మా నాన్న వస్తాడని పిల్లలు ఎంతో సంతోషముగా వారిని ఆధారారిస్తాడని ఆనందముగా ఎదురు చూస్తుంటారు, నిజానికి నాన్నతిరిగిరాని లోకానికి వెళ్ళాడని ఆ చిన్నారులకు తెలియదు. మరి పిల్లలయొక్క తాత నాయనమ్మలు వారిని పోషించే శక్తిలేక, ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకుంటారు, కానీ ప్రభుత్వాలు ఏనాడు కూడా పేదవారికి సరైన సమయంలో సహాయం అందక వారి యొక్క జీవితాలు ఆరంబంలోనే అంతం అవుతున్నాయి.

ఇలాంటి ఎజెంట్లచే మోసానికి గురైతున్న వారికి, పిల్లలకు మరియు ఇలా ప్రతి ఒక్కరికి ఆధారముగా మీ యొక్క మెర్సి ఆన్ స్లమ్స్ ఉదయించే సూర్యుడిలా చిగురిస్తున్న చిన్నారులకు, పావురమువలె ఎగిరిపోతున్న గల్ఫ్ వారికి మరియు భారతదేశం అనే మన ఇంట్లో ఎంతో మందికి ఆధారముగా నిలబడుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. మరియు మీ అందరి సహకారంతో ఈ యొక్క మెర్సి ఆన్ స్లమ్స్ ను ఎంతో మందికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాము ….!!!

హృదయ పూర్వకముగా మీ యొక్క మెర్సి ఆన్ స్లమ్స్

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites